ప్లంబర్ కు జాక్ పాట్.. ‘డ్రీమ్ 11’లో గెలిచిన రూ.కోటి ప్రైజ్ మనీ - TNews Telugu

ప్లంబర్ కు జాక్ పాట్.. ‘డ్రీమ్ 11’లో గెలిచిన రూ.కోటి ప్రైజ్ మనీBablu Mandal won Rs. Crore prize money in 'Dream 11'

బిహార్​ కటిహార్​ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్.. ​ క్రికెట్​ బెట్టింగ్​ యాప్ ‘డ్రీమ్​ 11’లో రూ.కోటి గెల్చుకున్నాడు. ప్లంబర్ పనులు చేసే అతను.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​​​లో అక్టోబర్​ 10న.. చెన్నై సూపర్​ కింగ్స్​, దిల్లీ క్యాపిటల్స్​ మధ్య జరిగిన క్వాలిఫయర్​-1 మ్యాచ్​పై బెట్​ వేశాడు. అదృష్టం అతడి తలుపుతట్టడంతో ఏకంగా.. కోటి రూపాయల ప్రైజ్​ మనీ గెల్చుకున్నాడు.

”నాతో పని చేసే అతను.. డ్రీమ్​ 11 గురించి చెప్పాడు. కొద్దిరోజుల క్రితమే నేను ఆడటం మొదలుపెట్టా. తొలుత రూ.200 పెట్టాను. ఏకంగా కోటి రూపాయలు గెల్చుకున్నాను. రూ. 30 లక్షలు ట్యాక్స్ కట్​ చేశారు. 70 లక్షలు నాకు వచ్చాయి. వచ్చిన పైసలతో మంచి ఇల్లు కట్టుకుంటాను. కొంతమొత్తాన్ని ఓ దేవాలయానికి విరాళంగా ఇస్తా.” అని  బబ్లూ మండల్​ చెప్పాడు.