జగ్గూభాయ్ ని టార్గెట్ చేసిన బాబు గోగినేని.. ఎందుకో తెలుసా..? - TNews Telugu

జగ్గూభాయ్ ని టార్గెట్ చేసిన బాబు గోగినేని.. ఎందుకో తెలుసా..?Babu Gogineni targets Jagapati Babu
Babu Gogineni Targets Jagapati Babu

మందు లేదు, సరైన వైద్యం దొరకడంలేదు, టీకాలు అందుబాటులో లేవు.. కరోనా వైరస్ క్రియేట్ చేసిన ఈ టెర్రర్ సిచువేషన్స్ నుండి మనకు కొద్దో గొప్పో ఊరట కలిగించే విషయం కృష్ణపట్నం ఆనందయ్య మందు. అల్లోపతీపై నమ్మకం కోల్పోయి ఆనందయ్య మందునే సంజీవనిలా భావిస్తున్న తరుణంలో ప్రజల మద్దత్తుతో పాటు సినీ సెలబ్రెటీలు కూడా ఆనందయ్య ముందుకి సప్పోర్ట్ చేశారు. టాలీవుడు నటుడు జగపతి బాబైతే ఒక అడుగు ముందుకేసి , స్వయంగా ఆనందయ్య మందు వేసుకొని.. ‘ ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా నేను నమ్ముతున్నా.. ప్రజలను కాపాడడానికి ఆనందయ్య మందు రూపంలో మనముందుకు ప్రకృతి వచ్చింది. ఆయుర్వేదంతో హాని లేదు. ప్రపంచాన్ని అదే కాపాడుతుంది అని జగపతి బాబు గతంలో పోస్ట్ చేశారు.

అయితే సైన్స్ సైన్స్ అంటూ టీవీ డిబేట్స్ లో జ్యోతిష్యుల భరతం పట్టడంలో ఫెమస్ అయినా బాబు గోగినేని జగ్గూభాయ్ పై కూడా స్పదించాడు. ఆనందయ్య ముందుకి సపూర్ట్ గా నిలిచిన జగపతిబాబుపై సెటైర్స్ వేసాడు. బాబు గోగినేని పోస్ట్ చేస్తూ ‘‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు.’’ అంటూ జగపతిబాబుపై బాబు గోగినేని కామెడీ సెటైర్లు వేశారు.