బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ ధనాధన్.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ 2022లో కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటర్లు చెలరేగారు. లియామ్‌ లివింగ్‌స్టోన్ 70 (5 ఫోర్లు, 4 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో 66(4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి అర్ధశతకాలు సాధించారు. దీంతో బెంగళూరుకు పంజాబ్‌ 210 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ 21, మయాంక్‌ అగర్వాల్ 19, జితేశ్‌ శర్మ 9, హర్‌ప్రీత్‌ బ్రార్ 7, రిషిధావన్‌ 7, రాహుల్ చాహర్‌ 2 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 4, హసరంగ 2.. మ్యాక్స్‌వెల్, షాహ్‌బాజ్‌ చెరో వికెట్ తీశారు.