విలన్ పాత్రలో బాలయ్య.. మరి హీరో ఎవరో తెలుసా ?

Balakrishna Accepted To Do Villain Role
Balakrishna Accepted To Do Villain Role

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హావ కనిపిస్తుంది. అటు ఓటిటి కావొచ్చు.. ఇటు సిల్వర్ స్క్రీన్ అవ్వొచ్చు.. బాలయ్య రఫ్ఫాడించేస్తున్నాడు. అఖండ మూవీతో బాక్సాఫీస్ బాక్సులు బద్దలు కొడుతున్నాడు బాలకృష్ణ. యూనానిమస్ హిట్ టాక్ తో అఖండ చిత్రం దూసుకెళ్తుంది. ఈ తరుణంలో తన అన్ స్టాపబుల్ ఓటిటి టాక్ షోలో అఖండ టీమ్ ని ఇంటర్వ్యూ చేశాడు బాలయ్య. డైరెక్టర్ బోయపాటి, హీరో శ్రీకాంత్, హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ లు బాలయ్య టాక్ షోలో సందడి చేశారు. ఈ క్రమంలో అఖండ సక్సెస్ జోష్ ఒక వైపు తాను హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు విశేష ఆధరణ దక్కటం మరోవైపు.. ఈ రెండు సక్సెస్ అంశాలు బాలయ్య హావభావాల్లో స్పష్టంగా కనిపించింది.

అఖండ టీమ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ షోకి సంబదించిన ప్రోమో తాజాగా విడుదలై యూట్యూబ్ లో నెం.1 గా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ప్రోమో చూస్తే.. అఖండ బృందంతో సరదాగా మాట్లాడిన బాలయ్య మధ్యలో తాను విలన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. కథలుంటే గనక తాను నటించేందుకు రెడీనే అంటూ.. చివరికో మెలిక వేసాడు. తాను విలన్ గా నటించబోయే చిత్రంలో హీరో కూడా తానే అయ్యుండాలనే విషయం బయటపెట్టాడు. గతంలో సుల్తాన్ అనే చిత్రంలో హీరో – విలన్ రెండు పాత్రల్లోనూ నటించాడు.బాలయ్య డబుల్ రోల్ చేయడం ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే త్వరలోనే బాలయ్య హీరోగా.. బాలయ్య విలన్ గా డబుల్ రోల్ సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మరి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య మనసులో మాట చెప్పేసరికి ఎవరైనా డైరెక్టర్ ముందడుగు వేస్తారేమో చూడాలి. ఇక బాలయ్య మరియు బోయపాటిల కాంబోలో వచ్చిన అఖండ సినిమా భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. వీక్ డేస్ లో కూడా సినిమా మంచి వసూళ్లు దక్కించుకుంటుంది.