మా నాన్న గారిని మీ తండ్రి బండోడా అంటాడా.. అల్లు అరవింద్ ఎదురుగానే.. రెచ్చిపోయిన బాలయ్య..!

Balakrishna Reveals The Relation Of His father Ntr And Allu Ramalingayya
Balakrishna Reveals The Relation Of His father Ntr And Allu Ramalingayya
Balakrishna Reveals The Relation Of His father Ntr And Allu Ramalingayya
Balakrishna Reveals The Relation Of His father Ntr And Allu Ramalingayya

తెలుగు చిత్ర పరిశ్రమని కొన్ని సంవత్సరాలు ఏలిన అగ్రనటుడు.. ఆంద్ర ప్రదేశ్ లో రాజకీయ వేత్తగా ఒక వెలుగు వెలిగిన దివంగత నాయకుడు, హీరో ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ ని ఎంతపెద్దవారైనా అన్నగారు అని అంటుంటారు. వయసుకి సంబంధం లేకుండా అప్పట్లో ఎన్టీఆర్ కి గొప్ప గౌరవం ఉండేది. ఎస్వీ రంగారావు, నాదెండ్ల భాస్కర్, ఏఎన్నార్ వంటి అతికొద్ది మంది మాత్రమే ఎన్టీఆర్ ని ప్రేమగా పేరు పెట్టె పిలిచేవారని అంటుంటారు. కానీ ఎన్టీఆర్ ని ఏరా, పోరా అనే చనువు ఎవరికీ ఉంటుందో మనకి ఇప్పటివరకు తెలీదు. ఎవ్వరు చెప్పనూలేదు. కానీ తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకున్నాడు. మేము చెన్నైలో ఉన్నప్పుడు..    మా వంటగదికి  వచ్చి అమ్మతో టీ, కాఫీ పెట్టించుకునే చనువు అల్లు రామలింగయ్య గారికి ఒక్కరికే ఉండేది. ఆయన     మా తండ్రిని బండోడా అని అనేవారు.. అల్లు రామలింగయ్య ఒక లెజెండ్ అంటూ ఎవ్వరికి తెలియని కొత్త కథనొకటి చెప్పాడు. అల్లు రామలింగయ్య వారసుడు.. అల్లు అరవింద సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు బాలకృష్ణ.

ఇక నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయ‌నున్న అన్ స్టాప‌బుల్‌ టాక్ షో ఆహాలో దీపావ‌ళి సంద‌ర్భంగా ప్రసారం అవుతుండగా.. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో బాలయ్య డ్యాన్సులు, డైలాగ్స్ తో అలరిస్తూ.. అన్ స్టాప‌బుల్‌ ఎనర్జీతో రెచ్చిపోయాడు బాలయ్య. ఈ క్ర‌మంలో అల్లు రామ‌లింగ‌య్య‌కు, త‌మ కుటుంబానికి ఉన్న రిలేష‌న్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేను హైదరాబాద్‌లోనే పెరిగాను. సెల‌వుల్లో మ‌ద్రాసు వెళ్లిన‌ప్పుడు, అక్క‌డ రామ‌లింగ‌య్య‌గారిని చూసేవాడిని. ఆయ‌న మా ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు నేరుగా మా వంటింటికి వెళ్లి మా అమ్మ‌గారి చేత్తో పెట్టిన టీ తాగేవారు. ఆమెతో ఇంటి విష‌యాల‌ను మాట్లాడేవారు. ఏమ్మా బండోడు (సీనియ‌ర్ ఎన్టీఆర్‌)తో ఏమైనా చెప్పాలా? అనేవాడు. అదేం లేద‌న్నయ్యా ఆయన నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు అంటే.. నువ్వు అగ్ని ప‌ర్వ‌తంలాంటిదానివి. మ‌న‌సులో పెట్టేసుకుంటావు.. చెప్ప‌మ్మా వెళ్లి చెబుతాను అనేవారు. అంత చ‌నువు ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కొక్క‌రికే ఉంది’’ అంటూ అల్లు రామ‌లింగ‌య్య‌తో ఉన్న అనుబంధాన్ని నెమ‌ర వేసుకున్నారు బాల‌య్య‌.