అడ్డంగా దొరికిన బండి.. వామ్మో ఫేస్ బుక్ ప్రచారానికి అన్ని లక్షలా.. తెలంగాణల టాప్..!

bandi sanjay top on facebook promotion in telangana
bandi sanjay top on facebook promotion in telangana

భాష పండితుడు.. మేధావి శ్రీ బండి సంజయ్ కి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. ప్రజలు మెచ్చే పనులు కాకుండా మత విద్వేషాలతో మార్కులు కొట్టేయాలనుకుంటాడు. పచ్చగున్న దేశంలో మత పిచ్చి నాటడానికి ఇలాంటి వారికి దొరికిన ఆయుధం సోషల్ మీడియా. బహిరంగంగా విద్వేషాలు రెచ్చగొడుతూ మత ప్రచారం చేస్తే బొక్కలో వేస్తారు. అందుకే ఎప్పుడైతే ఇండియాలో సోషల్ మీడియా ఎరా స్టార్ట్ అయ్యిందో.. అప్పటి నుండే దేశంలో బీజేపీ బలం పుంజుకుంది. సోషల్ మీడియాలో హిందువుల పేరుతో ముస్లిం మతంపై దుష్ప్రచారం చేయటం.. ముస్లిం అకౌంట్స్ తో హిందూ దేవుళ్ళని కించపరచటం వంటి చవకబారు ప్రచారాలు బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఓటర్ కి డబ్బులు పంచటం ఎంత నేరమో.. విద్వేషాలు రగిలించి ఓటర్ ని రెచ్చగొట్టడం అంతకంటే డేంజర్. ఈ వైఖరి తాత్కాలికంగా బీజేపీకి నాలుగు ఓట్లు తెచ్చిపెట్టొచ్చు.. కానీ మునుముందు దేశంలో అంతర్గత కలహాలకు దారి తీస్తుంది.

ఇవేవి పట్టించుకోకుండా బీజేపీ నేతలంతా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మత విద్వేషాలని రెచ్చగొడుతుంటారు. దీనికోసం భారీగా డబ్బులు ఖర్చు పెడతారు. ముఖ్యంగా ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్స్ తెరవటం కోసం లక్షల్లో ఖర్చు పెడుతుంటుంది బీజేపీ బ్యాచ్. అయితే సోషల్ మీడియా ప్రచారంలో తెలంగాణాలో బండి సంజయ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకప్పుడు సినిమా వార్తలకి ప్రాచుర్యమున్న సోషల్ మీడియా ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ అయిపోయింది. 2018 నుండి సోషల్ మీడియా ప్రచారం కోసం పొలిటికల్ పార్టీలు రూ. 188 కోట్లు ఖర్చు చేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ఫేస్ బుక్ లో ప్రచారం నిర్వహించేందుకు భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఫేస్ బుక్ కి ఇచ్చే ప్రకటనల్లో తెలంగాణ బిజెపి పెడుతున్న ఖర్చు దేశంలోనే ఐదవ స్థానంలో బండి సంజయ్ ని నిలబెట్టింది. ఈ విధంగా బండి సంజయ్ వార్తల్లోకి ఎక్కారు. ఈ విషయంలో అందరి కంటే ముందు వరుసలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిలుస్తున్నారు. గత నెల రోజులుగా ఫేస్ బుక్ లో ఆయన ప్రచారం నిమిత్తం 4.95 లక్షలను ఖర్చు పెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు బండి సంజయ్.