‘మా’ ఎన్నికలపై బండి సంజయ్ ట్వీట్.. ప్రకాశ్ రాజ్ రాజీనామాకు అదే కారణమా?

Bandi Sanjay tweet behind Prakash Raj's resignation

Bandi Sanjay tweet behind Prakash Raj's resignation

నటుడు ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను తెలుగువాడిని కాదని.. అతిథిగా వచ్చాను.. అతిథిగానే ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అసోసియేషన్ నుంచి బయటికి వచ్చానని, నటించవద్దని ఎలాంటి రూల్స్ కాబట్టి.. యధావిధిగా తెలుగు సినిమాల్లో నటిస్తానని వివరించారు.

అయితే ఈ సందర్భంలోనే ప్రకాష్ రాజ్.. తనకి ఆత్మాభిమానం ఉందని చెబుతూ.. తాను ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఓ బీజేపీ నేత కూడా ట్వీట్‌ చేశారని చెప్పారు. ఇంతకీ ఆ ట్వీట్ చేసిందెవరంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.

‘జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు’ అంటూ ట్విటర్​లో పోస్ట్ చేశారు. ‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్​కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం చెప్పారు’అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ గురించి ప్రకాష్ రాజ్ ను మీడియా ప్రశ్నించగా.. ‘మా’లో రాజకీయాలు ఎంట్రీ ఇచ్చాయని.. అది తనకు నచ్చలేదని అన్నారు. అందుకే అక్కడ ఉండలేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు