విజయ్ పుట్టగానే నేను ఒకే మాట చెప్పా.. బండ్ల బ్లాస్టింగ్ కామెంట్స్..!

bandla ganesh birthday wishes to vijay devarakonda
bandla ganesh birthday wishes to vijay devarakonda

మెగా ఫ్యామిలీకి వీరాభిమాని, పవన్ కళ్యణ్ భక్తుడు బండ్ల గణేష్ సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటారు. పవన్ చిరంజీవి సినిమా అప్డేట్స్ కి ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యే బండ్ల తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ట్వీట్ చేశారు. ఇంత‌కీ ఈయ‌న ప్ర‌త్యేంగా విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ఎందుకు ట్వీట్ చేశారా? అనే సందేహం రాక మాన‌దు. సోమవారం (మే 9) విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు. ఈ రౌడీ స్టార్‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు చెబుతూ బండ్ల గ‌ణేష్ .. విజ‌య్ దేవ‌ర‌కొండ తండ్రితో ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. విజయ్‌ పుట్టిన రోజున సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా అతడి విషస్‌ తెలిపారు. అలాగే బండ్ల గణేశ్‌ కూడా విజయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ మేరకు బండ్లగణేష్ ట్వీట్ చేస్తూ విజయ్‌ స్టార్‌ అవుతాడని అతడు పుట్టినప్పుడే వాళ్ల నాన్నతో అన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. బండ్లగణేష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చగా మారింది. బండ్లగణేష్ ఈ ట్వీట్ లో.. ”నాకు ఇంకా బాగా గుర్తుంది. మే 9న మీ నాన్న‌గారు వ‌చ్చి నాకు కొడుకు పుట్టాడు అని చెప్పారు. వెంట‌నే ఆ బాబు స్టార్స్ తో ఆశీర్వ‌దింప‌బ‌డ్డాడు అని నేను అన్నాను. డియ‌ర్ విజ‌య్ అన్ని స్టార్స్ క‌లిసి నిన్ను ఇండియ‌న్ సినిమా సూప‌ర్ స్టార్ గా నిల‌బెట్టాయి. హ్యాపీ బర్త్‌డే విజయ్” అని పోస్ట్ చేశారు. ఇక విజయ్ కి బర్త్ డే విషెష్ చెప్పాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. “నీ గుండెల్లో ఫైర్ చూసాను, నీలోని నటుడ్ని చూసాను. నీ కమిట్మెంట్, హార్డ్ వర్క్, ఒదిగివుండే గుణం ఇవన్నీ నిన్ను గొప్ప నటుడ్ని చేస్తాయి. ఏదో రోజు నువ్వు దేశానికే గర్వకారణం అవుతావు. ఇప్పటికైతే నిన్ను ది విజయ్ దేవరకొండ అని పిలుస్తాను. హ్యాపీ బర్త్ డే” అని రాసుకొచ్చాడు పూరి.