

మా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు సినిమా ఇండస్ట్రీ మీద పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుంటే.. దానికి కౌంటర్ ఇస్తూ పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో పవన్ తీరు, మా ఎన్నికల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ఫుల్ బిజీ అయిపోయింది. మా ఎన్నికల ప్రచారంలో కొంతమంది తారలు బిజీగా ఉంటే మరికొంత మంది సినీ సెలబ్రిటీలు మాత్రం.. సినీ రాజకీయాలను ప్రభావితం చేసే పనిలో బిజీగా ఉన్నారు.
అక్టోబర్ 10న జరుగనున్న మా ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావులు తమ ప్యానెల్ ను ప్రకటించి నామినేషన్లు కూడా కంప్లీట్ చేశారు. అందరూ మా అధ్యక్ష పదవి మీద కన్నేసి ఆ సీటును దక్కించుకోడానికి పోటీ పడుతుంటే.. బండ్ల గణేష్ మాత్రం జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడుతున్నాడు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి తనదైన శైలిలో ప్రచారం మొదలు పెట్టాడు. బండ్ల గణేష్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మా ఎన్నికల ప్రచారం ఆఫ్ లైన్ లో, ఆన్ లైన్ లో ట్వీట్లు, పోస్టులు పెడుతూ అందరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ ప్యానెల్ ప్రచారంలో బిజీ అయిపోయింది. ప్రచారంలో భాగంగా ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో ఉన్న కరపత్రాన్ని షేర్ చేస్తూ.. ‘#MaaElections2021.. మీ ఓటే మీ గొంతు.. ‘మా’ హితమే మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. ‘మా’ ఆశయాలను గెలిపిద్దాం.. అంటూ ట్వీట్ చేశాడు. అయితే.. ప్రకాష్ రాజ్ లా వెరైటీగా రాయలేకపోయాడో.. లేక అంత శ్రమ మనకెందుకులే అనుకున్నాడో తెలియదు కానీ… బండ్ల గణేష్ ఆ పోస్టును రీట్వీట్ చేస్తూ.. జనరల్ సెక్రటరీ ఓటు మాత్రం బండ్ల గణేష్ కి మాత్రమే వేయండి అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.
Only one vote for @ganeshbandla for General secretary 🙏 https://t.co/UDmRIJ9ai6
— BANDLA GANESH. (@ganeshbandla) September 29, 2021
దీంతో ప్రకాష్ రాజ్ ట్వీట్ కంటే బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ గా మారింది. బండ్ల గణేష్ ప్రచార తీరు చూస్తుంటే.. మా అధ్యక్ష ఓటు ఎవరికైనా వేసుకోండి.. జనరల్ సెక్రటరీ ఓటు మాత్రం మాకే వేయండి అన్నట్టుగా ఉందంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ప్రచారం కూడా బండ్ల తన మార్క్ చూపించాడురా అంటూ నెటిజనులు బండ్ల ట్వీట్ కు ఫిదా అవుతున్నారు.