‘మా’లో మంటలు.. మెగా ఫ్యామిలీనే తిడతావా.. నేనేంటో చూపిస్తా.. జీవితపై భగ్గుమన్న బండ్ల గణేష్..!

bandla ganesh sensational comments on jeevitha rajasekhar and maa election
bandla ganesh sensational comments on jeevitha rajasekhar and maa election
bandla ganesh sensational comments on jeevitha rajasekhar and maa election
bandla ganesh sensational comments on jeevitha rajasekhar and maa election

మా ఎన్నికలు పోరు రసవత్తర స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు అధ్యక్ష ఎన్నికల వేడి, వాడినే చూసాం. ఇప్పుడు లేటెస్ట్ గా సీన్ మారింది. అక్టోబర్ 10 ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయటంతో ఒక్కసారిగా సిచువేషన్స్ హీటెక్కిపోతున్నాయి. ఒకవైపు సాధారణ రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తూ జంప్ జిలానీలు తయారవుతుంటే.. మరోవైపు కొత్త వారి రాకపై ముందునుండి ఉన్న వాళ్ళు ఫైర్ అవుతున్నారు. మొన్నటివరకు అధ్యక్ష ఎన్నికల భరిలో ఉన్న హేమ, జీవితలు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోకి జంప్ అవ్వటం ‘మా’ లో ఇప్పుడు మంటలు రేపుతోంది. ముఖ్యంగా ప్రకాష్ ప్యానెల్ లోకి జీవిత రావటంపై బండ్ల గణేష్ భగ్గుమంటున్నారు. ఇంతకాలం ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా పనిచేసిన బండ్ల గణేశ్‌.. జీవిత రాకతో ఆ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ ఏడాది జరగబోయే ‘మా’ ఎన్నికల్లో జీవితపై పోటీగా జనరల్‌ సెక్రటరీ పదవి కోసం రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు బండ్ల గణేష్.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోకి జీవిత రాజశేఖర్ రావటంపై బండ్ల గణేష్ స్పందిస్తూ ‘ ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్‌ రావడం నాకు ఇష్టం లేదు. నాకు ప్రాణం కంటే ఎక్కువైన మా మెగా ఫ్యామిలీని నిత్యం కించపరిచే జీవిత మా ప్యానెల్ లోకి రావటంతోనే నేను తప్పుకుంటున్న. ఆమె జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీకి దిగుతుంది. నేను కూడా అదే పదివి కోసం ఆమెపై పోటీకి దిగుతాను. ఆమెని ఓడిస్తాను . అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకే ఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఏంటో తెలియజేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. రెండేళ్లుగా పదవుల్లో ఉంటూ ఏమి చేయకుండానే మళ్ళీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. అప్పుడు చేయనోళ్లు ఇప్పుడు చేస్తామంటే ఎవ్వరు నమ్మరు. మీ సపోర్ట్ తో గెలిచి ‘మా’ను బలోపేతం చేస్తూనే..పేద కళాకారులకు సొంతింటి కల నిజం చేస్తా. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి’ అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న బండ్ల వ్యాఖ్యలపై తాజాగా జీవిత రాజశేఖర్ కూడా స్పదించింది. ‘ మా అనేది అందరిది. ఎవరు ఎవరిపైనైనా పోటీ చెయ్యొచ్చు. ‘మా’ అభివృద్ధే అందరి ద్యేయం. అలాగే బండ్ల గణేష్ కూడా ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. దానిని వక్రీకరించొద్దు. నాకు బండ్ల గణేష్ తో ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. మేమంతా కలిసే పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, లేదా ఓడినా సరే ‘మా’ కోసం పనిచేస్తా’ అని జీవితా రాజశేఖర్‌ అన్నారు.