ఇండస్ట్రీలో కొత్త వివాదం.. సాయిధరమ్ పై నోరుపారేసుకున్న నరేశ్‌.. బండ్ల గణేశ్‌ సీరియస్..!

Bandla Ganesh Serious On Naresh Controversial Comments About Sai Dharam Tej
Bandla Ganesh Serious On Naresh Controversial Comments About Sai Dharam Tej
Bandla Ganesh Serious On Naresh Controversial Comments About Sai Dharam Tej
Bandla Ganesh Serious On Naresh Controversial Comments About Sai Dharam Tej

హీరో సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ తో మెగా ఫ్యాన్స్ ఆందోళనకి గురవుతున్నారు. తేజ్ ని పరామర్శించడానికి మెగా ఫ్యామిలీ అంతా అపోలోకి క్యూ కట్టగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలు అంత తేజ్ కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్ కూడా తేజ్ ఆక్సిడెంట్ పై స్పదింస్తు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. నీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా అంటూ నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బండ్ల గణేష్. ఇలాంటి రాజకీయాలు ఏంటని కూడా నట్టి కుమార్ లాంటోళ్ళు నరేష్ పై ఫైర్ అవుతున్నారు.

తేజ్ యాక్సిడెంట్ తరువాత నరేష్ మాట్లాడుతూ ‘బైక్ రైడింగ్ విషయంలో చాలా సార్లు నా కొడుకుని, సాయి ధరమ్ తేజ్‌‌ని హెచ్చరించా.. గతంలో కూడా బైక్స్ ఫై తేజ్, నా కొడుకు ఇద్దరూ రైడ్స్‌కి వెళ్లేవాళ్లు .. నాలుగు రోజుల క్రితం ఇద్దరికి కౌన్సలింగ్ కూడా ఇద్దాం అనుకున్నా.. తేజ్ కి నా కొడుకుకి ఈ విషయంలో ఒక సీరియస్ కౌన్సిలింగ్ అవసరం’ అని నరేష్ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ పై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తేజ్ రేసింగ్ చేస్తాడు, కౌన్సిలింగ్ ఇవ్వాలి అది ఇది అని అనవసరంగా నోరుపారేసుకున్న నరేష్ పై బండ్ల సీరియస్ అయ్యాడు.

నరేష్ కామెంట్స్ పై బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ ‘ ‘ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు. సాయి ధరమ్‌ తేజ్‌ మంచి వ్యక్తి. చక్కగా షూటింగ్‌లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆయన గురించి ఏవేవో మాట్లాడటం సరైనది కాదు. నరేశ్‌ గారు మీరు ఇలాంటి సమయంలో ఆయన కోలుకోవాలని ఆ పరమేశ్వరుడుని పార్థించండి. అంతేగాని బైక్‌ రేసులు చేశాడు, చెప్పిన వినట్లేదు అంటూ అవి ఇవి అన్ని ఎందుకు మాట్లాడటం సర్‌. ఈ సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు’ అంటూ బండ్ల వ్యాఖ్యానించారు. అయితే అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చికిత్స చేస్తున్న వీడియోని కూడా విడుదల చేశారు.

ఇక తేజ్ యాక్సిడెంట్ కాస్త ఇండస్ట్రీలో కొత్త వివాదానికి తెరపేలినట్టు అయింది. మా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లు తేజ్ ని ఆసుపత్రికి వెళ్లి చూడటం.. అది జరిగిన గంటకే నరేష్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయటం.. ఇప్పుడు తాజాగా నరేష్ పై బండ్ల గణేష్, నట్టి కుమార్ లు ఆగ్రహం వ్యక్తం చేయటం.. ఇలా తేజ్ ప్రమాదాన్ని కూడా ఈ సెలబ్రెటీలు ‘మా’ ఎన్నికల రాజకియం కోసం వాడుకుంటున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.