బండ్ల గణేష్ ట్వీట్ వైరల్.. మంచు ఫ్యామిలీయే టార్గెటా?

‘సహనానికి ఓ హద్దు ఉంటుంది. ఓర్పుకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఆ సహనం, ఓర్పు ఎదురుతిరిగితే ప్రళయం పుడుతుంది’ అంటూ బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్.. సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. బండ్ల గణేష్ ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టాడని నెటిజనులు మాట్లాడుకుంటున్నారు. మా ఎన్నికలు, మంచు విష్ణు గెలుపు, మోహన్ బాబు దూకుడు వంటి ఘటనల నేపథ్యంలో బండ్ల గణేష్ ట్విట్టర్లో చిరంజీవిని దృష్టిలో ఉంచుకొనే ఈ పోస్టు పెట్టాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ చిరంజీవికి, పవన్ కల్యాణ్ కి ఎంత పెద్ద అభిమానో తెలిసిన విషయమే.

bandla ganesh tweet about chiranjeevi targets to manchu mohan babu
bandla ganesh tweet about chiranjeevi targets to manchu mohan babu

గతంలో నోరు తెరిస్తే.. పవన్ కల్యాణ్ గురించే మాట్లాడే బండ్ల.. కొన్ని నెలల నుంచి చిరంజీవిని తెగ పొగిడేస్తున్నాడు. కరోనా సమయంలో బెడ్స్ దొరకని సమయంలో చిరంజీవి చొరవ తీసుకొని తనను అపోలో హాస్పిటల్ లోచేర్పించడం, తన ప్రాణాలు కాపాడటం వంటి ఘటనల నేపథ్యంలో ఆయన మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు బండ్ల గణేష్. మా ఎన్నికల్లో మెగాస్టార్ సపోర్ట్ తో ఎన్నికల్లో పోటీ చేసిన బండ్ల గణేష్.. ఓ టీవీ చర్చలో చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆలోచింపచేశాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త పెద్ద అవసరమా అని యాంకర్ అడుగగా.. ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి ఉండగా.. ఇన్ని మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేస్తుండగా మరో పెద్ద అవసరం లేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు బండ్ల గణేష్. అయితే.. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలవడం, నరేష్, మోహన్ బాబు లాంటి వాళ్లు రెచ్చిపోవడం వంటి ఘటనల నేపథ్యంలోనే బండ్ల గణేష్ ట్విట్టర్ లో ఆ పోస్టు పెట్టినట్టు భావిస్తున్నారు పలువురు.

ఆ పోస్టు కంటే ముందు.. ‘‘Postponement is not punishment its an achievement now a days’’ అంటూ ఇంకో పోస్ట్ పెట్టి అందరినీ అయోమయానికి గురి చేశాడు గణేష్. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. ఇది ఫోన్ ద్వారా తనకు షేర్ చేసిన కోట్ మాత్రమే అని.. అంతా బాగానే ఉందని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాసేపటికే ‘‘సహనం.. ఓర్పు ఎదురు తిరిగితే ప్రళయం పుడుతుంది’’ అంటూ పైన పేర్కొన్న ట్వీట్ వేసి చిరును టార్గెట్ చేస్తున్న వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాను అని చెప్పకనే చెప్పాడు బండ్ల గణేష్.