
మొన్నటివరకు ‘మా’ కింగ్ ఎవరన్నా చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొల్పింది. తీవ్ర ఉత్కంఠత నడుమ ఎన్నికలు జరిగాయి. ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు సంచలన విజయం సాధించాడు. ఇక ఇక్కడితో గొడవలు సద్దుమణుగుతాయని. అందరు కలిసి పనిచేస్తారని బావించారంతా.. కానీ అలా జరుగుతే మా స్పెషలిటీ ఏముంటుంది. అందరి అంచనాలని తలకిందులు చేస్తూ తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులందరు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా తన ప్యానల్ సభ్యులతో ప్రకాష్ రాజ్ ప్యానల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. సంచలన విషయాలు బయటపెట్టారు. ఎన్నికల కౌంటింగ్ దెగ్గర తమకు ఏ విధంగా అవమానాలు ఎదురయ్యావు చెప్తూ.. మంచు ఫ్యామిలీ డామినేషన్ ని తెలియజేశారు.
మోహన బాబు బాండ బూతులు తిడుతూ సభ్యురాల్ని కొట్టడానికి ప్రయత్నించటం.. మంచు విష్ణు యాటిట్యూడ్ చూపెట్టాడు అంటూ ఎవ్వరి వర్షన్ వారు చెప్పగా.. సీనియర్ ఆర్టిస్ బెనర్జీ అయితే మోహన్ బాబు గురించి చెప్తూ కన్నీటిపర్యంతం అయ్యాడు. పోలింగ్ కేంద్రం లోనే మోహన్ బాబు నోటికి వచ్చినట్లు తిట్టారని.. విష్ణు గొడవ వద్దు అన్నారని గుర్తు చేశారు. అంతేకాదు.. తనను మోహన్ బాబు కొట్టడానికి వచ్చాడని… పచ్చి బూతులు తిట్టారని ఆరోపణలు చేశారు. ఇంత అవమానం తో ఎందుకు బతకాలి అనుకున్నానని.. మా ఫ్యామిలీ కూడా బాధ పడిందని చెప్పారు. మూడు రోజులుగా..మోహన్ బాబు భార్య కూడా ఫోన్ చేసి భాద పడిందని వెల్లడించారు బెనర్జీ. ఇప్పుడు రాజీనామా చేశాక.. ఆ బాధ కాస్త తగ్గిందన్నారు.