మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్బులో చేరిన ‘బంగార్రాజు’

'Bangarraju' joins Rs 50 crore club

సంక్రాంతి బరిలో దిగిన బంగార్రాజు మూడోరోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. నాగార్జున కెరీర్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో బంగార్రాజు సినిమా చేరింది.

ఏపీలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా తన సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించదని.. సినిమా విడుదలకు ముందు నాగార్జున చెప్పారు. ఆయన చెప్పినట్లే ప్రస్తుతం బంగ్రార్రాజు కలెక్షన్లు సాధిస్తుంది.

తెలంగాణ, ఏపీ లో కలిపి దాదాపు రూ.24 కోట్ల షేర్ వసూలు కాగా.. ప్రపంచ వ్యాప్తంగా రూ.27 కోట్లు వసూలు చేసింది. తెలంగాణలో ఇప్పటికే 7 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఓవర్సీస్ లో 1.20 కోట్లు, కర్ణాటకలో రూ.95 లక్షలు వసూలు చేసింది.

కథ రొటీన్‌గానే ఉన్నా స్క్రీన్ ప్లే తెలివిగా ఉండటం, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ, నాగార్జున, నాగ చైతన్య స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. మొత్తానికి పండగ లాంటి సినిమా అంటూ సంక్రాంతికి వచ్చి కలెక్షన్ల పండగ చేసుకుంటున్నాడు నాగార్జున.