వచ్చే నెలలో 16 రోజులు బ్యాంకులు బంద్

Bank Holidays December 2021: Banks to remain closed for these days next month

మరి కొన్ని రోజులలో ఈ సంవత్సరపు చివరి నెల.. డిసెంబర్ 2021 ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలోపు పూర్తి చేయాల్సిన నగదు లావాదేవీలు ఏవైనా ఉండి వుంటే వీలైనంత త్వరగా మేల్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చే నెలలో బ్యాంకులకు RBI ఏకంగా 16 రోజుల సెలవులను ప్రకటించింది.

మొత్తం 16 రోజులు బ్యాంక్ సెలవులు ఉండగా… అందులో 4 సెలవులు ఆదివారాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల పండుగలు కలిపి ఏకంగా 16 రోజులు సెలవులు ఉండనున్నాయి. డిసెంబర్ నెలలో వచ్చే మెయిన్ ఫెస్టివల్ క్రిస్మస్.. సందర్భంగా దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిగతా సెలవుల్లో కొన్ని రోజులు స్థానిక సెలవులు అనగా.. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే సెలవు ఉండగా.. మిగతా రాష్ట్రాల బ్యాంకులు తెరచి ఉండనున్నాయి. ఆ సెలవు దినాలను ఒకసారి పరిశీలిస్తే…

డిసెంబర్ 3 – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివల్ (పనాజీలో బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 5 – ఆదివారం
డిసెంబర్ 11 – రెండో శనివారం
డిసెంబర్ 12 – ఆదివారం
డిసెంబర్ 18 – యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 19 – ఆదివారం
డిసెంబర్ 26 – ఆదివారం
డిసెంబర్ 24 – క్రిస్మస్ పండుగ (ఐజ్వాల్‌లో బ్యాంకులు పనిచేయవు)
డిసెంబర్ 25 – నాల్గవ శనివారం, క్రిస్మస్ (బెంగళూరు, భువనేశ్వర్ మినహా అన్ని ప్రదేశాలలో బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 27 – క్రిస్మస్ వేడుకలు (ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 30 – యు కియాంగ్ నోంగ్‌బా (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 31 – నూతన ఏడాది సాయంత్రం (ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు)