ఏఆర్ రహ్మాన్ సంగీతంలో ఈసారి బతుకమ్మ పాట - TNews Telugu

ఏఆర్ రహ్మాన్ సంగీతంలో ఈసారి బతుకమ్మ పాటతెలంగాణ జాగృతి బతుకమ్మ పాట ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్ బతుకమ్మ పాటకు సంగీతం అందించారు. ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ బతుకమ్మ సాంగ్ కు డైరెక్ట్ చేశినట్టు సమాచారం.

సినీ ఇండస్ట్రీలో ఇద్దరు దిగ్గజాలు కలిసి రూపొందించడంతో బతుకమ్మ పాట.. దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ మరోసారి హాట్ టాపిక్ అవ్వనుంది. భారత దేశం గర్వించదగ్గ ఇద్దరు సినీ దిగ్గజాలు మన బతుకమ్మ పాటకు పనిచేయడం మనందరం గర్వించదగిన అంశం.