బీసీ కులగణన.. డిసెంబర్ 13న బీసీల జంగ్ సైరన్

Jazzula-Srinivas-Goud

జనగణనలో బీసీ కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, బీసీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి బీసీ కులగణన చేపట్టేలా చేస్తామన్నారు. డిసెంబర్ 13వ తేదీన బీసీల జంగ్ సైరన్, 14వ తేదీన పార్లమెంట్ ముట్టడి, 15వ తేదీన జాతీయ స్థాయి అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ వీటికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.

రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం పైన రైతులు తిరగబడి రైతు వ్యతిరేక బిల్లులను వెనకకు తీసుకునేలా ఉద్యమం చేసినట్లు తాము కూడా ఉద్యమానికి సిద్ధం అయ్యామని, కేంద్రం మెడలు వంచి బీసీ కులగణన చేపట్టేలా చేస్తామన్నారు.  ఈ సందర్భంగా బీసీ కుల జనగణనకు మద్దతు పలికిన పలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.