టీమిండియా తాత్కాలిక కోచ్ గా మిస్టర్ వాల్… బీసీసీఐ సమాలోచనలు - TNews Telugu

టీమిండియా తాత్కాలిక కోచ్ గా మిస్టర్ వాల్… బీసీసీఐ సమాలోచనలుటీ20 వరల్డ్ కప్ తర్వాత జరుగనున్న న్యూజిలాండ్ సిరీస్ కు టీమిండియాకు తాత్కాలిక కోచ్ గా మిస్టర్ వాల్, మిస్టర్ డిపెండబుల్ గా పిలుచుకునే టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. టీమిండియాకు కొత్త కోచ్ ను నియమించే విషయంలో బీసీసీఐ ఈ సారి నిత్యం అడ్డంకులు ఎదుర్కుంటున్న తరుణంలో గతంలో ఒకసారి టీమిండియాకు కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ ను తాత్కాలిక కోచ్ గా నియమించే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేలను సంప్రదించగా వారు బీసీసీఐ అభిప్రాయాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయితే.. వరల్డ్ కప్ దగ్గర పడుతుండటంతో ఎలాగైనా ఈ లోపే ఎలాగైనా రాహుల్ ని ఒప్పించి న్యూజిలాండ్ సిరీస్ కి కోచ్ గా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


సొంత‌గ‌డ్డ‌పై జరిగే న్యూజిలాండ్‌ సిరీస్‌కు ద్ర‌విడ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియ‌మించేందుకు బీసీసీఐ పావులు కదుపుతోంది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ముగిసిన తర్వాత నవంబర్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఈ ఏడాది శ్రీలంక‌లో ఇండియా సెకండ్ రేట్ టీమ్‌కు ద్ర‌ావిడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. అయితే.. టీమిండియా కోచ్ పదవిపై కొంతమంది ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆస‌క్తి చూపుతున్న‌ా.. బీసీసీఐ మాత్రం భారత క్రికెటర్ కే ఆ బాధ్యతలు అప్పజెప్పేందుకు మొగ్గు చూపుతోంది.