‘ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు.. రైతుల్లా పోరాడాలి’

Be ready for agitation like farmers, Farooq Abdullah tells party workers

రద్దు చేసిన ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు కోసం జమ్ముకశ్మీర్‌ ప్రజలు.. రైతుల్లా పోరాటం చేయాలని మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లోని నసీంబాగ్ సమాధి వద్ద జరిగిన పార్టీ యువజన విభాగం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివాదస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 11 నెలలకుపైగా పోరాడారని, 700 మందికిపైగా చనిపోయారని అన్నారు. రైతుల బలిదానాలతో దిగి వచ్చిన కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని తెలిపారు.

కశ్మీరీలు తమ హక్కులు తిరిగి పొందాలంటే రైతుల్లా త్యాగాలు చేయాలని అన్నారు. తాము ఆర్టికల్ 370, 35 ఏ, రాష్ట్ర హోదాను తిరిగి పొందుతామని వాగ్దానం చేశామని గుర్తుచేశారు. దాని కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.