వైరల్ వీడియో: రోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్న స్కూల్ అమ్మాయిలు

వారంతా స్కూల్ విద్యార్థులు. బుద్ధిగా చదువుకుంటారని తల్లిదండ్రులు స్కూలుకు పంపిస్తే.. వీరు మాత్రం రోడ్డు మీద జట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఈ వైరల్ వీడియో కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ కు చెందిన విద్యార్థినిలు స్కూల్ బయట జట్టుపట్టుకొని విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒకరి జుట్టు ఒకరు లాగడం, నెట్టడం, గుద్దడం మరియు ఒకరినొకరు తన్నుకోవడం వంటివన్నీ వీడియోలో రికార్డ్ అయ్యాయి. వీరితో పాటు క్యాజువల్ డ్రెస్సుల్లో ఉన్న చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు కూడా పోట్లాడుకోవడం చూడవచ్చు. ఈ గొడవలో ఒక అమ్మాయి బేస్ బాల్ బ్యాట్ తీసిన తర్వాత కొంతమంది కల్పించుకొని అడ్డుకోవడం కూడా మనం చూడవచ్చు. అయితే ఈ గొడవకు గల కారణం మాత్రం తెలియలేదు. ఒక అమ్మాయిని కొట్టడానికి తన స్నేహితురాలు తనను కోరినట్లు గొడవలో పాల్గొన్న విద్యార్థిని ఫోన్ స్క్రీన్ షాట్ ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది.