మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవుతుందా.. ఈ టిప్స్ ఫాలో అవండి

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని మనిషే ఉండడు. మనిషి నిత్య జీవితంలోనే కాదు.. మనిషి శరీరంలోనే స్మార్ట్ ఫోన్ ఒక భాగమై పోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. కూర్చున్న దగ్గర నుంచే అన్నీ పనులు చేసుకోవచ్చు.. చేయించుకోవచ్చు. అయితే.. స్మార్ట్ ఫోన్ విపరీతంగా వాడటం వల్ల హ్యాంగ్ అయి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే.. చాలామంది ఫోన్ హ్యాంగ్ అయిందంటే పాడైపోయిందనుకుంటారు. కొత్త ఫోన్ ఏది తీసుకోవాలా అని ఆలోచిస్తుంటారు. అయితే.. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలంటున్నారు టెక్కీలు. అవేంటో చూద్దామా!

చాలావరకు ఆండ్రాయిడ్ యాప్స్ యూజర్లకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ అందించడానికి క్యాచీడ్ డేటా సేవ్ చేసి పని చేస్తుంటాయి. ప్రతిసారి మొదటి నుంచి లోడ్ కాకుండా ఉండేందుకు యాప్స్ స్పీడ్ గా వే ఓపెన్ అయ్యేందుకు యాప్స్ క్యాచీ డేటా స్టోర్ చేసుకుంటాయి. కొద్దిరోజులు వాడిన తర్వాత ఆ యాప్ ని డిలీట్ చేసినప్పుడు ఆ యాప్ కి సంబంధించిన క్యాచీ డేటా కూడా అలాగే ఉంటుంది. వాటిని డిలీట్ చేయడం వల్ల మొబైల్ లో ఫ్రీ స్పేస్ ఏర్పడుతుంది. దీంతో.. ఫోన్ స్పీడ్ గా పనిచేస్తుంది.

ఫోన్ లో పేరుకుపోయిన అనవసరమైన డేటాను క్లియర్ చేయడం ద్వారా ఫోన్ పనితీరుని మెరుగు పరుచుకోవచ్చు. ఒక యాప్ కి సంబంధించిన క్యాచీ డేటాను డిలీట్ చేయాలంటే.. సెట్టింగ్స్> అప్లికేషన్‌లు> అప్లికేషన్ మేనేజర్‌లోకి వెళ్లాలి. డిలీట్ చేయదలచుకున్న అప్లికేషన్‌ కి సంబంధించిన క్యాచీని సెలెక్ట్ చేయండి. తరువాత యాప్ అప్లికేషన్ డీటెయిల్స్ మెనూకి వెళ్లి.. స్టోరేజీపై క్లిక్ చేయండి. తర్వాత క్లియర్ క్యాచీ ఆప్షన్ పై నొక్కితే చాలు. అన్ని యాప్‌ల నుంచి క్యాచీ డేటాను డిలీట్ చేయాలంటు సెట్టింగ్స్ లో స్టోరేజ్‌లోకి వెళ్లి పై నొక్కండి.


డేటాను స్టోర్ చేయడానికి క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించడం వల్ల కూడా మొబైల్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. మన డేటాను క్లౌడ్ స్లోరేజ్ లో సేవ్ చేయడం వల్ల మొబైల్ స్టోరేజీ మీద భారం తగ్గుతుంది. ఇందుకు గానూ.. గూగుల్ డ్రైవ్ 15జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా అందిస్తుంది. గూగుల్ తో పాటు డ్రాప్‌బాక్స్ లో 2జీబీ ఫ్రీ స్టోరేజ్, వన్ డ్రైవ్ లో 5జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా పొందొచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్రీఅప్ స్పేస్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే.. అనవసరంగా పేరుకుపోయిన మెమొరీని క్లియర్ చేయొచ్చు. ఇలా చేయాలంటే సెట్టింగ్స్ లో డివైజ్ మెయింటెనెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టోరేజ్ లోకి వెళ్లండి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డివైజ్ మెయింటెనెన్స్ కి బదులు డివైజ్ కేర్ అని ఉంటుంది. దానిలోకి వెళ్లి ఫ్రీఅప్ స్పేస్ మీద క్లిక్ చేయండి. ఇలా చేస్తే బ్యాక్అప్ అయిన అవసరం లేని ఫైల్స్ డిలీట్ అవుతాయి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరు తగ్గిపోయిందా? బాగా హ్యాంగ్ అవుతుందా? అంటే ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందని అర్థం. చాలామంది తమకిష్టమైన సినిమాలను హెచ్‌డీ క్వాలిటీల్లో డౌన్‌లోడ్ చేసి మొబైల్ ఇంటర్నల్ స్టోరేజీలో, యాప్ స్టోరేజీలో సేవ్ చేసుకుంటున్నారు. తమ ఫోన్ లో తీసిన ఫొటోలు, వీడియోల వల్ల కూడా మెమొరీలో ఎక్కువ స్పేస్ నిండిపోతుంది. దీంతో స్పేస్ లేక ఫోన్ హ్యాంగ్ అవుతుంది.

128జీబీ లేదా అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నా.. కొంతమందికి స్టోరేజ్ సమస్యలు వస్తున్నాయి. అయితే.. ముఖ్యమైన ఫైల్స్ కచ్చితంగా ఉండాల్సిందే. వాటిని డిలీట్ చేయడానికి చాలామంది ఇష్టపడకపోవచ్చు. అప్పుడు మీ ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆక్రమించుకునే కొన్ని అనవసరమైన ఫైల్స్ గుర్తించాలి. వాటిని డిలీట్ చేసేయాలి. దీంతో మీ ఫోన్ సూపర్ స్పీడ్‌గా పనిచేస్తుంది.