ఆమె రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే.. అన్యాయంగా ఎలిమినేట్ చేశారు.. ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ మీద కౌశల్ మంద సెన్సేషనల్ కామెంట్స్ - TNews Telugu

ఆమె రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే.. అన్యాయంగా ఎలిమినేట్ చేశారు.. ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ మీద కౌశల్ మంద సెన్సేషనల్ కామెంట్స్Big boss 2 Winner Kaushal Manda Sensational Comments On Lahari Elimination
Big boss 2 Winner Kaushal Manda Sensational Comments On Lahari Elimination

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 నాలుగో వారం కొనసాగుతోంది. పందొమ్మిది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇప్పటికే ముగ్గురు మూటముల్లె సర్దుకొని బయటకు వచ్చారు. మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి ఎలిమినేట్ అయ్యారు. అయితే.. ఎవరూ ఊహించని విధంగా లహరి, సరయుల ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే.. మిగతా ఇద్దరి ఎలిమినేషన్ గురించి స్పందించిన బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్.. కౌశల్ మందా లహరి ఎలిమినేషన్ గురించి స్పందించాడు. లహరిని బిగ్ బాస్ హౌజ్ నుంచి అనవసరంగా ఎలిమినేట్ చేశారని.. ఆమెను షో లోకి ఎంట్రీ ఇవ్వాలని కామెంట్స్ చేశాడు.

Big boss 2 Winner Kaushal Manda Sensational Comments On Lahari Elimination
Big boss 2 Winner Kaushal Manda Sensational Comments On Lahari Elimination

హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన లహరి.. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ ని కలిసింది. ఈ విషయాన్ని కౌశల్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. బిగ్ బాస్ హౌజ్ లో నీ స్టైల్ నాకు నచ్చింది. ఈ సీజన్ లో బోల్డ్ అండ్ బ్యూటీకి నువ్వో ట్రంప్ కార్డ్. కాకపోతే అంత త్వరగా బయటకు రావడం బాధగా ఉంది. నిన్ను మళ్లీ షో లో చూస్తానని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా అంటూ స్టోరీ పెట్టాడు. లహర్కమ్ బ్యాక్ అంటూ హాష్ ట్యాగ్ యాడ్ చేశాడు. కౌశల్ పోస్ట్ చూసిన పలువురు నెటిజనులు లహరి బిగ్ బాస్ హౌజ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Tags:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,