ఈసారి బిగ్ బిస్ విన్నర్ ఈమెనేనా.. ప్రతి ఎపిసోడ్ లో అందుకే హైలెట్ చేస్తున్నారా? - TNews Telugu

ఈసారి బిగ్ బిస్ విన్నర్ ఈమెనేనా.. ప్రతి ఎపిసోడ్ లో అందుకే హైలెట్ చేస్తున్నారా?బిగ్ బాస్ ల నలుగురు కంటెస్టెంట్లు బయటకు రాగా.. ప్రస్తుతం హౌజ్ లో 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే.. ఈ మధ్య అందరి కంటే ఒక కంటెస్టెంట్ ని బాగా హైలెట్ చేస్తున్నారు. నెలరోజుల బిగ్ బాస్ ప్రయాణంలో బిగ్ హౌజ్ లో కంటెస్టెంట్ల ప్రవర్తనలు ఎన్నో మార్పులు ప్రేక్షకులు గమనిస్తున్నారు. అంతేకాదు.. బిగ్ బాస్ స్ట్రాటజీలు కూడా ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. వచ్చినప్పటికీ.. ఇప్పటికీ హౌజ్ మేట్లు మాట్లాడే తీరు.. వారి పద్ధతి అన్నింటిలో మార్పులొచ్చాయి. అయితే.. సినిమాలు, సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ప్రియాను కొద్దిరోజులుగా బిగ్ బాస్ హైలెట్ చేస్తూ వస్తున్నాడు.


ఈ షోలో ప్రియా కొత్తగా.. మునుపటి కంటే అందంగా.. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూల్ గా డీల్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతుంది. ప్రతి టాస్క్ లో జాగ్రత్తగా ఆచితూచి ప్లాన్ చేసుకొని పార్టిసిపేట్ చేస్తుంది. దీంతో ప్రియా అందరి కంటే ఎక్కువ హైలెట్ అవుతుంది. దీనికి తోడు.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రియాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్.. స్క్రీన్ మీద ఆమె అందంగా కనిపించడంతో బిగ్ బాస్ కూడా ఆమెకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నాడు.


అయితే.. బిగ్ బాస్ లో ప్రతి వారం, ప్రతి టాస్క్ లో ప్రియాను హైలెట్ చేయడం పట్ల సరికొత్త చర్చ మొదలైంది. ఈ సీజన్ బిగ్ బాస్ హౌజ్ లో ఎక్కువగా ప్రియానే చూపిస్తున్నారు. అంటే.. ఆమెనే ఈ సారి బిగ్ బాస్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు హౌజ్ లో ఆమె ప్రవర్తన, పార్టిసిపేషన్, అందం ఈ వార్తలకు బలాన్నిస్తున్నాయి. ఇప్పటికి నాలుగు సీజన్లలో అందరూ మగవారే బిగ్ బాస్ విన్నర్ కావడంతో ఈసారి కచ్చితంగా మహిళనే బిగ్ బాస్ విన్నర్ అవుతారని.. ఆ విన్నర్ కూడా ప్రియానే అనే చర్చ మొదలైంది.

Tags:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,