దయచేసి బూతులు తిట్టొద్దు.. షణ్ముఖ్ ఫ్యాన్స్ ని వేడుకున్న.. సన్నీ తల్లి.. అసలేం జరిగింది ?

Big Boss Sunny Mother Kalavathi Message To Shanmukh Fans
Big Boss Sunny Mother Kalavathi Message To Shanmukh Fans

తెలుగు బిగ్ బాస్ లో లవ్ ఎఫైర్స్ ఎంత సహజమో.. గ్రూప్ ఫైట్స్ అంతే కామన్. హౌస్ లో సన్నీ, షణ్ముఖ్ మధ్యలో రాజుకున్న గొడవ.. హౌస్ బయట వారిద్దరి అభిమానుల వరకు చేరింది. బిగ్ బాస్ విన్నర్ షణ్ముఖ్ అంటూ ఒక గ్రూప్, లేదు సన్నీనే విజేత అని మరో గ్రూప్ సోషల్ మీడియాలో దూషణలకి దిగుతున్నారు. ఈ క్రమంలో సన్నీ తల్లి కళావతి స్పందించింది. దయచేసి వ్యక్తిగత దూషణలకి దొగొద్దని షణ్ముఖ్ ఫ్యాన్స్ కి చేతులెత్తి దండం పెట్టి వేడుకుంది. అయితే వీరిద్దరి అభిమానుల గొడవకి ముఖ్య కారణం.. రోజు రోజుకి సన్నీకి సపోర్ట్ పెరిగిపోతుండటమే అని అంటున్నారు నెటిజన్స్. వీకెండ్‌ ఎపిసోడ్‌లో మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ అందరు సన్నీ టాప్‌-5లో కచ్చితంగా ఉంటాడని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో షణ్నూ- సన్నీ ఫ్యాన్స్‌ మధ్య కాస్త సోషల్‌ వార్‌ నడుస్తుంది. విన్నర్‌గా తేలేది సన్నీనే అంటూ ఇద్దరి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్‌ చేస్తూ నెగిటివిని పెంచేస్తున్నారు.

అయితే సన్నీ మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఒకే గ్రాఫ్ మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. షణ్ముఖ్ పై అంచనాలు ఉన్నప్పటికీ టాస్క్ లలో అతడు అంత యాక్టివ్ కాదు అనే విమర్శ ఉంది. మిగిలిన విషయాలలో కరెక్ట్ పాయింట్ మాట్లాడడం అతడి బలం. కానీ షణ్ముఖ్ పేరు ఇద్దరి ఫైనలిస్టుల రేసులో వినిపిస్తుండడం కాస్త అనూహ్యమే. మొదట్లో యాంకర్ రవి, మానస్, శ్రీరామ్ వంటి చాలామందిపై అంచనాలు ఉన్నా.. తాజాగా మాత్రం బిగ్ బాస్ విన్నర్ పై వేరే పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, కాజల్.. మానస్ లేదా ప్రియాంక టాప్ 5 లో ఉంటారనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా సన్నీ, షణ్ముఖ్ అభిమానులు పరస్పర విమర్శలతో సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు. దీనితో సన్నీ తల్లి కళావతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మీకు నచ్చిన వారికి ఓట్లు వేసి గెలిపించండి.. అంతేకాని నెగిటివ్ కామెంట్స్ చేయవద్దు. ఒకరిని హీరో చేయడం కోసం మరొకరిని జీరో చేయవద్దు అని ఆమె నెటిజన్లని చేతులు జోడించి వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.