బిగ్ బాస్ సీజన్ 5.. నామినేష‌న్‌లో తొమ్మిది మంది.. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్‌ అంటూ హైపర్ అయిన షణ్ముఖ్‌ - TNews Telugu

బిగ్ బాస్ సీజన్ 5.. నామినేష‌న్‌లో తొమ్మిది మంది.. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్‌ అంటూ హైపర్ అయిన షణ్ముఖ్‌బిగ్ బాస్ ఐదో వారం నామినేష‌న్ ప్ర‌క్రియ ముగిసింది. ఈసారి నామినేష‌న్ లో ఏకంగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఈ సారి నామినేష‌న్‌లో అత్యధిక ఓట్లు షణ్ముఖ్‌కు పడ్డాయి. జెస్సీ తప్ప హౌజ్ లోని అబ్బాయిలు అందరూ షణ్ముఖ్‌ను నామినేట్‌ చేశారు.

దీంతో షణ్ముఖ్ ఒకింత హైపర్ అయ్యాడు. ‘ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్‌ చేస్తున్నా..’ ‘ఇప్పుడు చూస్తార్రా నా గేమ్‌’ అంటూ ఒక్కసారిగా హౌజ్ మెట్స్ పై అసహనాన్ని వ్యక్తం చేశాడు.

నామినేష‌న్ పూర్త‌య్యాక‌.. బిగ్ బాస్ ఎవరిని ఎవరు నామినేట్ చేశారో టీవీలో చూపెట్టాడు. దీంతో హౌజ్ మెట్స్ మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. కొందరు లైట్ తీసుకోగా.. మరికొందరు సీరియస్ అయ్యారు.

ఈ క్రమంలో రవి..ష‌ణ్ముఖ్ మ‌ధ్య మ‌ళ్లీ చిచ్చు రేగింది. నీతో మాట్లాడనంత మాత్రన నేను స‌రిగ్గా ప‌ర్‌ఫార్మ్ చేయ‌ట్లేద‌ని కాదు అంటూ ర‌వి మొహంపైనే ష‌ణ్ను చెప్పాడు. అంత హార్ష్ గా మాట్లాడకురా అంటూ రవి కూడా బాగానే రెస్పాండ్ అయ్యాడు. రవి ఏదో చెబుతుండగానే.. ఇప్పటి నుంచి చూస్తారు నా గేమ్.. ఇప్పటి వరకూ నా గేమ్ చూడలేదంటూ.. అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయాడు.

ఈ వారం నామినేట్ అయిన సభ్యులు(నామినేట్ చేసిన సభ్యులు)

* షణ్ముఖ్ (సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్)

* జెస్సీ (విశ్వ, రవి, మానస్, శ్రీరామ్)

* యాంకర్ రవి (జెస్సీ, కాజల్, సిరి, ఆనీ)

* మానస్ (లోబో, శ్వేతా, షణ్ముఖ్)

* లోబో (జెస్సీ, ప్రియాంక)

* సన్నీ (కాజల్, ప్రియ)

* విశ్వ (ఆనీ, షణ్ముఖ్)

* హమీదా (ప్రియాంక, సిరి)

* ప్రియ (సన్నీ, హమీదా)