ఆ హగ్గులు ఏంటమ్మా.. షణ్ముఖ్ పై సిరి తల్లి షాకింగ్‌ కామెంట్స్‌..!

Bigg Boss Siri Mother Shocking Comments On Shanmukh Jaswanth
Bigg Boss Siri Mother Shocking Comments On Shanmukh Jaswanth

అసలు తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావట్లేదు. జీరో ఎమోషన్స్ ఓన్లీ గేమ్స్ అన్నదే బిగ్ బాస్ అసలు థీమ్. భావోద్వేగాలు పక్కన పెట్టినవాళ్లే ఇప్పటిదాకా బిగ్ బాస్ విజేతలయ్యారు. కానీ ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ లోని క్రేజీ కంటెస్టెంట్స్ సిరి, షణ్ముఖ్ లు మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారేమో అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. దీనికి ప్రధాన కారణం వారిద్దరూ చీటికిమాటికి హగ్గులు ఇచ్చుకుంటూ హౌస్ లో రొమాన్స్ చేయటమే. మేమిద్దరం బయట వేరు వేరు వ్యక్తులతో రిలేషన్ లో ఉన్నాం.. కానీ ఇక్కడ మేమిద్దరం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాం.. కంట్రోల్ అవ్వటం లేదు అంటూ సిరి షణ్ముఖ్ లు ఇద్దరు నాగార్జున ఎదుట కూడా ఒప్పుకున్నారు. దీంతో ఇదే విషయంపై సిరి మదర్ కూడా రెస్పాండ్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు బిగ్ బాస్. మొన్న కాజల్ కూతురు హౌస్ లో సందడి చేయగా.. ఆ తరువాత మానస్ తల్లి బిగ్ బాస్ హూసు లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా సిరి మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. వస్తు రాగానే కూతురు సిరిని గట్టిగ హత్తుకుని హగ్ ఇచ్చింది. దాంతో సిరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూతురిని బాగా ఆడుతున్నావ్‌ అని ప్రొత్సహిస్తూనే.. షణ్ముఖ్‌ని హగ్‌ చేసుకోవడం నచ్చడంలేదని షాకింగ్‌ కామెంట్‌ చేసింది సిరి తల్లి. దీంతో షణ్ముఖ్ మొహం ఒక్కసారిగా మాడిపోయినట్టు అయిపోయింది. షణ్ముఖ్‌ సిరిగా బాగా హెల్ప్‌ చేస్తున్నాడని, అది తనకు నచ్చడం లేదని చెప్పింది. మరి సిరి తల్లి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు షణ్ముఖ్ గేమ్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపెడుతుందో చూడాలి.