ఇసామియా బజార్ లో 45 అడుగుల అమ్మవారి విగ్రహం.. ఘనంగా శరన్నవరాత్రుల వేడుకలు - TNews Telugu

ఇసామియా బజార్ లో 45 అడుగుల అమ్మవారి విగ్రహం.. ఘనంగా శరన్నవరాత్రుల వేడుకలుBiggest Maatha Idol Will Established In Esamiya Bazar For Devi Navaratri Celebrations
Biggest Maatha Idol Will Established In Esamiya Bazar For Devi Navaratri Celebrations

హైదరాబాద్ సుల్తనా్ బజార్ లోని ఇసామియా బజార్ లో ఈ ఏడాది కూడా ఎప్పట్లానే 45 అడుగుల భారీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శరన్నవరాత్రుల ఉత్సవాలు, పూజలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఛైర్మన్, తెలంగాణ గంగపుత్ర ఎడ్యుకేషనల్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ ఛైర్మన్ గులాబ్ శ్రీనివాస్ తెలిపారు. నగరంలోనే భారీ ఎకో ఫ్రెండ్లీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తితో పూజలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. గత 22 సంవత్సరాలుగా అతి పెద్ద దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.

Biggest Maatha Idol Will Established In Esamiya Bazar For Devi Navaratri Celebrations
Biggest Maatha Idol Will Established In Esamiya Bazar For Devi Navaratri Celebrations

ఈ ఏడాది అమ్మవారిని శ్రీ చక్ర విశ్వరూపిని రూపంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. గత 35 రోజులుగా 22 మంది కళాకారులు విరామం లేకుండా విగ్రహ తయారీలో నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. కలకత్తా నుంచి తెచ్చిన ఎర్ర సముద్రం ఇసుక, గడ్డి, కట్టెలు వాడుతున్నారు. ప్రకృతికి ఎలాంటి కీడు చేయకుండా విగ్రహ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి మాత అయిన అమ్మవారిని ప్రకృతి రూపంలో..ప్రకృతి నుంచి తీసుకున్న వస్తువులతో తిరిగి ప్రకృతిలో కలిసిపోయేలా రూపొందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.