బీజేపీ తొలి జాబితా.. అక్కడినుంచే సీఎం యోగి

Yogi Adityanath

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి రెండు దశలకు 107 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. పార్టీ నుంచి ఇటీవల బయటకు వెళ్లిన 20 మంది సభ్యులను తొలగించింది. బీజేపీ ప్రకటించిన 107 మందిలో 63 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ జాబితాను విడుదల చేశారు. మొదటి దశలో 58 స్థానాలకు గానూ 57 మంది అభ్యర్థుల జాబితాను, రెండో దశలో 55 మంది అభ్యర్థులకు గానూ 48 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ కేంద్రమైన గోర్ఖ్‌పూర్ నుండి పోటీ చేస్తుండగా.. డిప్యూటీ కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సిరతు నుండి పోటీ చేయనున్నారు. పంకజ్ సింగ్ నోయిడా నుంచి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ మధుర నుంచి పోటీ చేయనున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని 403 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 11 జిల్లాల్లోని మొత్తం 58 స్థానాలకు ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది.