బీజేపీ అభ్యర్థి ఈటల, ఆ పార్టీపై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు - TNews Telugu

బీజేపీ అభ్యర్థి ఈటల, ఆ పార్టీపై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు



balka suman vs Eatala rajendar

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన బీజేపీ అభ్యర్థి ఈటలపైన,ఆ పార్టీపైన ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.  టీఆర్ఎస్ పార్టీ, పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నంపై ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతల దాడిపై  కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్ నిర్వహించడంపైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేయడంతో పాటు, డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటల ఓటర్లును తప్పుదోవ పట్టించడం, టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేయడంపైన ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్.. అన్ని కేసులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు.