ఇంట్లో ఉన్నది ఐదుగురు.. పడ్డ ఓటు ఒక్కటే.. ఇదీ బీజేపీ పరిస్థితి - TNews Telugu

ఇంట్లో ఉన్నది ఐదుగురు.. పడ్డ ఓటు ఒక్కటే.. ఇదీ బీజేపీ పరిస్థితిఆ ఇంట్లో ఉన్నది మొత్తం ఐదుగురు. ఐదుగురిలో ఒకరు బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే ఆ అభ్యర్థికి పడ్డ ఓట్ల లెక్క చూస్తే అధికారులతో సహా.. అభ్యర్థి కూడా షాక్ అయ్యాడు. ఒక్కటంటే.. ఒక్కటే ఓటు బ్యాలెట్ బాక్స్ లో దర్శనమిచ్చింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.

bjp get only one vote in tamilnadu elections
bjp get only one vote in tamilnadu elections

తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ తరపున పోటీ చేసిన ఓ అభ్యర్థికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కోయంబత్తూర్​లో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన వ్యక్తకి ఒకే ఒక ఓటు దక్కింది. ఇందులో విశేషమేంటంటే.. ఆయన ఇంట్లో మొత్తం ఐదు ఓట్లుంటే కేవలం ఒకే ఓటు ఆయనకు పడటం చర్చనీయాంశమైంది. ఈ నెల 6, 9 తేదీలలో తమిళనాడులో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 27వేల మూడు వార్డుల్లో కలిపి 79,433 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అందులో కోయంబత్తూర్ జిల్లాలోని పెరియనైకెంపాలెం అనే వార్డు నుంచి డీ.కార్తీక్ అనే వ్యక్తి బీజేపీ తరపున పోటీ చేశాడు. కాగా ఆయన కుటుంబ సభ్యుల్లో మొత్తం ఐదుగురికి ఓటు హక్కు ఉంది. ఫలితాల్లో చూస్తే.. ఆయనకు కేవలం ఒకే ఒక పడిందని తేలింది.


వాళ్లకు.. వీళ్లకు తెలిసి ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది తెలిసిన కొంతమంది బీజేపీ మీద వ్యంగాస్త్రాలు సంధించారు. స్థానిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి ఒక్క ఓటే వచ్చింది. ఆయనకు కాకుండా.. వేరే వారికి ఓటు వేసిన ఆయన కుటుంబ సభ్యులను చూస్తే గర్వంగా ఉంది.. అంటూ తమిళనాడుకు చెందిన రచయిత్రి మీనా కందసామి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆయన కుటుంబంలో ఐదుగురు ఉన్నా.. ఆయనకు కోయంబత్తూర్​లో ఒక్కటే ఓటు పడింది. తమిళనాడులో భాజపా పరిస్థితి కూడా ఇంతే.. అంటూ తమిళనాడు కాంగ్రెస్ నేత అశోక్ కుమార్ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి కార్తీక్ విడుదల చేసిన పోస్టర్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాతో కలిపి.. మొత్తం ఏడుగురు జాతీయ స్థాయి నేతలున్నారని.. అయినా కనీసం ఏడు ఓట్లు కూడా పడలేదని సోషల్ మీడియాలో కార్తీక్ ని, బీజేపీని ఆడుకుంటున్నారు.