సింగరేణిని అమ్మేందుకు బీజేపీ సర్కారు కుట్ర

TRS-Leaders-Press-Meet

తెలంగాణ ప్రాంతానికి కొంగు బంగారంగా ఉన్న సింగరేణి సంస్థ.. లక్షలాది కుటుంబాలకు వెలుగును నింపుతూ లాభాల్లో ఉన్న సంస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మేయలని కుట్ర పన్నడం అమానుషమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఎంపీ వెంకటేష్ నేత లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

సింగరేణి కార్మిక కుటుంబాలతో కలిసి ఉద్యమం చేసేందుకు టీఆరెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చెసినట్లు సింగరేణి ని కూడా చేర్చడం దుర్మార్గం. లాభాలలో నడిచే సంస్థలను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం  ఏమోచ్చింది. ఎంఎండీఆర్ యాక్ట్ ని తీసుకొచ్చి కేంద్రం సింగరేణికి ఉన్న హక్కులను హరిస్తుంది. లాభాల బాటలో నడుస్తున్న బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు.

కొత్త బ్లాకులు తవ్వుకోవడాని పర్మిషన్ ఇవ్వకపోగా.. ఉన్న బ్లాకులను ప్రైవేటు పరం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తి, రవాణా రంగంలో సింగరేణి గణనీయమైన వృద్ధి సాదించింది. దేశవ్యాప్తంగా ఉన్న 98 బ్లాకులను ప్రయివేటు పరం చేయాలని కేంద్రం చూస్తుంది. బొగ్గు బ్లాకులను ప్రయివేటు పరం చేయొద్దని 2015లో 2021 లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు.

2014 సంవత్సరంలో అధికారం చేపట్టేనాటికి 4 వందల 79 లక్షల టన్నుల రవాణా చేస్తే ఈ ఏడాది 2021-22 లో 6 వందల 70 లక్షల టన్నుల రవాణా చేస్తున్నాము. ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి పెంచుతున్నము. సింగరేణి లో పని చేస్తున్న ఉద్యోగులకు అనేక సౌకర్యాలు కల్పించాం. వందలాది కోట్ల లాభాలతో నడుస్తున్న ఈ సంస్థను అమ్మాలని కేంద్రం చూస్తున్నది. లక్షలాది కుటుంబాలకు జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ సంస్థ కోసం పోరాటం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కార్మిక, పారిశ్రామిక వ్యతిరేక విధానాలను ఎండగడతాం. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పోరాడాలని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు.

బీజేపీ నేతలను సింగరేణి కార్మికులు నిలదీయాలి: ప్రభుత్వ విప్ బాల్క సుమన్

సింగరేణి సంస్థ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును టీఆరెస్ పార్టీ  ఖండిస్తున్నది. కేంద్రం వైఖరి పట్ల ఎంతటి పొరటానికైనా సిద్ధం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అద్భుతమైన పురోగతి సాధిస్తున్న ఈ సంస్థను నాశనం చేయాలని భావిస్తున్నది. లాభాల బాటలో ఉన్న ఈ సంస్థను నష్టాల బాటలోకి నెట్టి అమ్మాలని కుట్ర పన్నుతుంది. 4 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కుట్ర చేస్తున్నారు. సింగరేణి సంస్థ మీద బీజేపీ కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. మోడీ దోస్తులకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తున్నారు. దిన దిన గండంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఉద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో వారసత్వ ఉద్యోగాలు తిరిగి చేపట్టామన్నారు.

బొగ్గు బ్లాకులు ప్రయివేటు పరం అయితే వారసత్వ ఉద్యోగాలు కొనసాగనివ్వరు. IIT ,IIM లో చదువుతున్న పిల్లలకు ఫీజులు చెల్లిస్తుంది సంస్థ ప్రయివేటు పరం అయితే ఇది సాధ్యం కాదు. రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాడుతాం. గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేస్తాం. రాష్ట్ర సాధనలో సింగరేణి ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఎంపీలు ఎం చేస్తున్నారు సమాధానం చెప్పాలి. వీళ్ళ కు ఓట్ల రాజకీయం తప్ప ఇక్కడి ప్రజల సమస్యలు పట్టవు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఎందుకు మౌనంగా ఉన్నారు. సింగరేణి సంస్థకు జరుగుతున్న కుట్రలో నోరు మెదపని బీజేపీ నాయకులను బట్టలుడదీసి కొట్టాలన్నారు.

సింగరేణి కి అండగా టీఆరెస్ పార్టీ గులాబీ జెండా అండగా ఉంటుంది. సింగరేణిని బతికించుచుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. అన్ని సంఘాలు కలిసి రావాలి. కార్మికులకు అండగా టీఆరెస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుంది. తెలంగాణ బీజేపీ నాయకులు నాలుగు బొగ్గు బ్లాకుల ఈ వేలాన్ని అడ్డుకోవాలి. బీజేపీ నేతలపై సింగరేణి కార్మికులు తిరగబడాలి, నిలదీయాలి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మా పోరాటం ఉధృతం చేస్తామన్నారు.

గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేస్తాం: ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి

కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణి మీద దురుద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నారు. అన్ని సంఘాలు వ్యతిరేకించిన కేంద్రంలో ఉన్న బీజేపీ పెడచెవిన పెట్టింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. కార్మికుల నుండి ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామన్నారు.

బీజేపీ వైఖరిని అందరూ ముక్తకంఠంతో ఖండించాలి:ఎమ్మెల్యే కోరుకంటి చందర్

సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రయివేట్ పరం చేస్తున్న బీజేపీ వైఖరిని అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. తెలంగాణ పై వివక్ష మరోసారి కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వక పొగా ఇప్పుడు సింగరేణి సంస్థని నిర్వీర్యం చేసేందుకు చూస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. కేంద్రం దిగివచ్చేవరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు.