గ్యాస్ సిలిండర్ ధరపై బీజేపీది జూటా ప్రచారం.. ఈటలకు మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్

Minister Harish Rao fire on Eatala rajendar

Minister Harish Rao fire on Eatala rajendar

కరీంనగర్ జిల్లాలో ఇవాళ జరిగిన గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ వచ్చాక తొలి నాళ్లలో గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్, సర్టిఫికెట్స్ ఇవ్వాలని ఆలోచించి.. బడ్జెట్ లో నిధులు కూడా పెట్టింది. కానీ  కొద్ది మంది కోర్డుకు వెళ్లారు. కాని అది కుడా పరిష్కారం అయింది. సిద్దిపేటలో 15 ఏళ్ల కిందటే మంచి భవనం నిర్మించాం. మెడికల్ కాలేజీ వస్తే కొత్త స్థలంలో రూ.40 లక్షలతో భవనం కట్టించాం. ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల ఉన్నారు. ఆరు సార్లు గెలిపించారు. ఒక్క భవనం అయినా నిర్మించారా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ను అలా అన్న రోజే నీ ఆత్మగౌరవం పోయింది

ఆరుసార్లు టికెట్ ఇచ్చి, రెండు సార్లు మంత్రిగా ఈటలకు అవకాశం ఇచ్చి.. ఎంతో ప్రేమతో కేసీఆర్ దగ్గరికి తీసుకున్నారు. ఈటల ఏం  అంటున్నరు. ఘోరీ కడతా అంటున్నడు. ఇందులో నీతి ఏమైనా ఉందా.. కేసీఆర్ ను అలా మాట్లాడిన రోజే నీకు ఆత్మగౌరవం లేదు అని అర్థం అయింది.  బొట్టుబిల్లలు, కుట్టుమిషన్లు పంచిన నాడే ఆత్మగౌరవం లేదని అర్థం అయింది. నా పుట్టుక, డీఎన్ఏ లెఫ్టిజం అన్నవు. కాని బీజేపీలో చేరావు. పదవుల కోసం నమ్ముకున్న సిద్ధాంతాలు వదులుకున్నవు.  బీసీల బిడ్డ అని చెప్పి ఎస్సీ, ఎస్టీల , బీసీల భూముల కబ్జా చేశావు. నీవే అత్మగౌరవాన్ని మంటకలుపుకున్నావు.

ఈటలవి అహంకారపు మాటలు 

కళ్యాణలక్ష్మి, రైతు బంధు పరిగె ఏరుకున్నట్లు అని అహంకారంగా మాట్లాడారు. నువ్వే రైతు బంధు పది లక్షల 50 వేలు తీసుకున్నవు.  వీణ వంక మండలంలో మాట్లాడుతూ.. నాకు 200 ఎకరాలున్నది.. ఎకరం అమ్మి గెలుస్తా అన్నది అహంకారపు మాటలు కాదా.. నేను ఆస్థిపరుడ్ని అమ్ముతా గెలుస్తా అనడం అహంకారం కాదా.. కోడుకా,  అరెయ్ బిడ్డా అని  సహచరులను పట్టుకుని మాట్లాడటం ఫస్ట్రేషన్ కాదా.. అహంకారం కాదా. రెండున్నర సంవత్సరాలు టీఆర్ఎస్, కేసీఆరే ఉంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అభివృద్ధి జరుగుతుందా. ప్రతీ మంత్రికి ఐదేళ్లక్రితం సీఎం కేసీఆర్  4 వేల ఇళ్లు కట్టించమని ఇచ్చారు. నేను, ఇతర మంత్రులు ఇళ్లు కట్టించాం. కానీ ఒక్క ఇళ్లు కట్టించని మంత్రి ఈటల రాజేందర్. నువ్వు 4 వేల  ఇల్లుకట్టించి ఉంటే 12 వేల మంది ఆత్మగౌరవం నిలబడేది కదా… ఏదీ పెదల మీద ప్రేమ.

ఇది నడుమంతరపు ఎన్నిక. ఐదేళ్ల ఎన్నిక కాదు

గెల్లు శ్రీనును గెలిపించండి.. ఇళ్లు కట్టే బాధ్యత మాది. ఇది నడుమంతరపు ఎన్నిక. ఐదేళ్ల ఎన్నిక కాదు. 17 ఏళ్లు ఈటలను గెలిపంచారు కదా.. ఏం పట్టించుకోలేదని మీరే చెబుతున్నరు. మీ భవనాలు పూర్తి చేయిస్తా… మీలో ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తాం. జరగాల్సినంత అభివృద్ది హూజూరాబాద్ , జమ్మికుంటలో జరగలే. ఈ మూడు నెలల్లో ఎంత పని జరుగుతుంది మీరే చూడండి.

ప్రతీ అక్కౌంట్ లో 15 లక్షలు వేస్తం అన్నరు. వేసారా..

బీజేపీ పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధర పెంచింది. రోడ్లు,  ఎల్ ఐసీ, రైళ్లు, విమానాశ్రయాలు అమ్ముతుం కుదవ పెడతం అంటున్నరు. విదేశాల్లోంచి నల్ల ధనం వెనక్కు తెప్పిస్తాం. ప్రతీ అక్కౌంట్ లో 15 లక్షలు వేస్తం అన్నరు. వేసారా.. పెద్ద నోట్లు రద్దు చేసి బ్యాంకు దగ్గర లైన్లో నిలబడమని చెప్పి. ధన్ జన్ అక్కౌంట్లు తెరవండి. నల్ల ధనం డబ్బులు ధనా ధన్ వేస్తం అన్నరు. వేసిండ్రా. గ్యాస్ ధర వెయి రూపాయలకు పెంచారు. సబ్సిడీ 250 నుండి 40 రూపాయలకు తగ్గించారు.  అయినా బీజేపీకి ఓటు వేస్తా అంటే ఇంకా ధరలు పెంచాలనా… రాజేందర్ తను అంటించుకున్న బురదను అందరికీ అంటించి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. రాజేందర్  గెలిస్తే వ్యక్తి గా ఆయనకు ప్రయోజనం. గెల్లు గెలిస్తే హూజూరాబాద్ కు ప్రయోజనం.

సిలిండర్ పై ఉన్నది  5 శాతం జీఎస్టీ.. అదీ కేంద్రం పెట్టిందే 

2 గుంటల గెల్లు.. 200 ఎకరాల ఆసామితో పోటీ పడుతున్నడు. గెల్ల గెలిస్తే మీ సేవలో ఉంటాం. కోడ్ ముగిసాక  గ్రామీణ వైద్యులకు రక్షణ కలిగేలా, శిక్షణ ఇచ్చేలా పూర్తి సహకారం అందిస్తా.. బీజేపీ మాటల్లో ఒక్కటయినా నిజం ఉందా.. ఈటల హూజూరాబాద్ లో.. కమలాపూర్ లో మాట్లాడాడు. గ్యాస్ సిలిండర్ పై 250 రూపాయలు ట్యాక్స్ ఉందని కమలాపూర్ లో అన్నడు.. హూజూరాబాద్ లో 294  రూపాయలు ట్యాక్స్ వేస్తున్న అన్నడు. కాని రాష్ట్రప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ట్యాక్స్ వేయడంలేదు. ఉన్నది జీఎస్టీ పన్ను 5  శాతం. కేంద్రం విధించింది. అదీ 47 రూపాయలు మాత్రమే. ఎంత జూటా మాటలు మాట్లాడిండు. బీజేపీ గ్యాస్ సిలండర్ ధర పెంచిందంటే పెద్ద అబద్ధం మట్లాడారు. కాని రూ.250  రాష్ట్ర పన్ను అని నిన్న రూ.294 నిన్న పన్ను ఉందని అబద్ధాలు చెబుతున్నడు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించుకోవచ్చు కదా అని ఈటల అన్నారు. కాని  ఇది జీఎస్టీ పరిధిలో ఉంది. రాష్ట్రానికి సంబంధం లేదు. ఇది ఎంత పెద్ద అబద్ధం.

ఏ సెంటర్ కు రావాలో చెప్పు

జమ్మికుంట గాంధీ కాడికి రమ్మంటే వస్తా…. హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రమ్మంటే వస్తా.. రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ 294 రూపాయలు ఉందని నిరూపిస్తే అక్కడే ముక్కు నేలకు రాస్తా. రాజేందర్ రెడీగా ఉన్నారా. కమలా పూర్ లో కారు -ఆటో యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ చనిపోయాడు. బాల్క సుమన్ కారుతో గుద్ది చంపిండు అని ప్రచారం చేశారు. తర్వాత సుమన్ తమ్ముడు అని చెప్పారు. తర్వాత టీఆర్ఎస్ లీడర్ తాగి, డబ్బులు కారులో ఉన్నాయి. డ్రైవర్ ను గుద్దాడు అని ప్రచారం చేశారు. కాని సీసీ టీవీ ఫుటేజీ తీస్తే  ఆకారుతో గుద్దింది బండి సంజయ్ సన్నిహుతుడు.  ఇది బీజేపీ పరిస్థితి బట్ట కాల్చి మీద వేసే పద్ధతి వాళ్లది. వీటిని నమ్మద్దు. సోషల్ మీడియా ద్వారా కూడా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపిస్తారు.’’ అని హరీష్ రావు ఈటల, బీజేపీపై మండిపడ్డారు.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఆర్ఎంపీ లు, పీఎంపీలులేకుండా గ్రామాలులేవు. సీఎం కేసీఆర్ 4 వేల ఇళ్లు కట్టివ్వమని హుజూరాబాద్ కు ఇచ్చారు. కాని మంత్రిగా ఉన్న ఈటల మాత్రం కట్టించలేదు. కేసీఆర్ ఏం తప్పు చేశారు.  రైతులకు ఏడాదికి పది వేలు ఇవ్వడం తప్పా… ఇది ప్రజల ప్రభుత్వమన్నారు.