15వ రౌండ్‌లో బీజేపీకి 2వేల లీడ్

Huzurabad-byelection-counting

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో ఇప్పటివరకు 15రౌండ్ల లెక్కింపు పూర్తి అయింది. 15వ రౌండ్ లెక్కింపులో గెల్లు శ్రీనివాస్‎కు 3,358 ఓట్లు.. ఈటలకు 5,507 ఓట్లు,  కాంగ్రెస్‎కు 152 ఓట్లు వచ్చాయి.

బీజేపీ 2,149 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 15 రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీకి 68,586 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 57,003 ఓట్లు, కాంగ్రెస్‎కు 1,982 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 11,583 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.