12వ రౌండ్‌లో బీజేపీకి ఆధిక్యం

bjp

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్ రౌండ్ కి ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రతి రౌండ్ లో లీడ్ ఇరుపార్టీల నడుమ మారుతూ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు 12రౌండ్ల లెక్కింపు పూర్తి అయింది.

12వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి 4,849 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ కు 3,632, కాంగ్రెస్‎కు 158 ఓట్లు వచ్చాయి.  ఈటలకు 1,217 ఓట్ల ఆధిక్యం లభించింది. 12 రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీకి 53,497 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 46,974 ఓట్లు, కాంగ్రెస్‎కు 1729 ఓట్లు నమోదయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల 6,523 లీడ్ లో కొనసాగుతున్నారు.