ఉపఎన్నిక‌ల్లో బీజేపికి ఘోర ప‌రాజ‌యం.. దేశ వ్యాప్తంగా మోదీకి ఎదురుగాలి..!

narendra-modi

దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఈ నెల 30న మొత్తం 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌స‌భ స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. ఇవాళ ఆ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫ‌లితాలు వెలువడ్డాయి. మూడు లోక్‌స‌భ స్థానాల్లో పోటీచేసిన బీజేపీ.. రెండు చోట్ల ఓడి ఒక్క‌చోట, 30 అసెంబ్లీ స్థానాల్లో కేవ‌లం 7 చోట్ల మాత్ర‌మే బీజేపీ అతి కష్టంమీద గట్టెక్కింది.

ఒక్క పార్లమెంట్ స్థానంలోనే..

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని మండి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖంద్వా, దాద్రాన‌గ‌ర్ హవేలీ అండ్ డామ‌న్ డ‌య్యూలోని దాద్రాన‌గ‌ర్ హ‌వేలీ లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జరుగ‌గా.. కేవ‌లం ఖంద్వా నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రమే బీజేపీ గెలిచింది.

డిపాజిట్లు కూడా రాలే

ప‌శ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీప‌డ్డ బీజేపీకి మూడు చోట్ల డిపాజిట్‌లు కూడా ద‌క్క‌కపోవడం గమనార్హం. ఇక హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉండి కూడా బీజేపీ గెల్వలేకపోయింది. మూడు అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగితే మూడు స్థానాల్లో బీజేపీకి ప‌రాభ‌వ‌న్ని మూటగట్టుకుంది.

tmc winning celecrations

సీఎం సొంత జిల్లాలోనూ ఓడింది

క‌ర్ణాట‌క‌లోనూ బీజేపీ అధికారంలో ఉన్నా.. హంగ‌ల్‌ అసెంబ్లీ స్థానంలో ఘోరంగా ఓడిపోయింది. ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై సొంత జిల్లాలో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఉన్నా.. ఆయ‌న త‌న పార్టీని గెలిచిపించుకోలేక‌పోయారు. మ‌రో స్థాన‌మైన‌ సిండ్‌గీలో కేవ‌లం 7,500 ఓట్ల అత్తెసరు మెజారిటీతో బీజేపీ గట్టెక్కింది.

స్వల్ప మెజారిటీతో నిల్చిన పరువు

అసోంలోనూ బీజేపీ 5 స్థానాల్లో పోటీచేసి కేవ‌లం 3 స్థానాల్లో మాత్ర‌మే స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ మూడు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. రెండు స్థానాల్లో నెగ్గింది. తెలంగాణ‌లో హుజురాబాద్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ నెగ్గినా.. అది లోకల్ అభ్యర్థి ఇమేజ్‌తో ద‌క్కిన విజ‌య‌మే.

Petrol, Diesel prices today: Petrol price hiked by 30 paise per litre

ఇంధన ధరలు ఎఫెక్ట్?

దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నికలు జరుగగా.. బీజేపీ కేవ‌లం అసోంలో 3, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. మిగతా అన్ని స్థానాల్లో ఆ పార్టీ ఘోర పరాజయాలను మూట గట్టుకుంది. బీజేపీ ఘోర ఓటమికి స్థానిక సమస్యలతోపాటు పెరుగుతున్నఇంధన ధరలు కూడా ప్రభావితం చూపాయని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.