నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

నేను బీజేపీ ఎంపీని ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ నా జోలికే రాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ సంజయ్ కాకా పాటిల్. మహారాష్ట్రలోని ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మీద గత కొన్నిరోజులుగా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. కాగా.. అదే పార్టీకి చెందిన మరో నాయకుడు అనిల్ దేశ్ ముఖ్ ఇంట్లో కూడా సీబీఐ సోదాలు చేసింది. వారితో పాటు మరికొంతమంది ఎన్సీపీ నాయకులు, ప్రముఖుల ఇండ్లలో కూడా ఈడీ, సీబీఐ సోదాలు చేస్తోంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేసి బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుందని మహావికాస్ అఘాడీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా.. మహారాష్ట్రకు చెందిన సాంగ్లీ బీజేపీ ఎంపీ సంజయ్ కాకా పాటిల్ ఈ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

BJP MP Sanjay Kaka Patil Controversial Comments On ED And CBI Rides
BJP MP Sanjay Kaka Patil Controversial Comments On ED And CBI Rides

స్థానికంగా జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడినసంజయ్ కాకా ఈడీ నా జోలికే రాదు. ఏదో డాబు కోసం రూ.40 లక్షల కార్లో తిరుతున్నాం. మా అప్పులు చూస్తే ఈడీ కూడా నివ్వెరపోతుంది అన్నాడు. గతంలో అదే పార్టీకి చెందిన హర్షవర్ధన్ పాటిల్ కూడా భాజాపాలో చేరిన తర్వాత ప్రశాంతంగా ఉంది. ఎలాంటి ఎంక్వైరీలు లేవు. బాగా నిద్ర పడుతోంది అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.