హుజూరాబాద్‌లో బీజేపీకి ఓటమి తప్పదు: ఎంపీ అసదుద్దీన్‌

MP Asaduddin
MP Asaduddin
MP Asaduddin
MP Asaduddin

హుజూరాబాద్‌ ఉపఎన్నికలోనూ బీజేపీకి ఓటమి ఖాయమని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తేల్చిచెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, ఐటీ ఎగుమతులు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో  శాంతిభద్రతలకు ఢోకా లేదని, శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తున్నాయని కొనియాడారు. ప్రజలు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెటుకొని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని ఆయన చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 100 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో బహుజనవాదాన్ని, లౌకిక కట్టుబాటును చెదరగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని అసదుద్దీన్‌ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో పక్షపాతం వహిస్తున్నదని, ఆర్థిక సహకారం అందించడం లేదని ఆగ్రహించారు. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో భారీ వర్షాలతో వరదలు వచ్చినప్పుడు ఎలాంటి సాయం చేయలేదని గుర్తు చేశారు.