బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు గన్‌ లైసెన్స్‌

Salman Khan

ప్రముఖ బాలీవుడ్‌ సినీ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్‌ జారీ అయ్యింది. సల్మాన్‌ను, ఆయన తండ్రిని చంపుతామంటూ బెదిరింపు లేఖ రావడంతో .. తుపాకీ లైసెన్స్‌ కోరుతూ ఇటీవల సల్మాన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వెరిఫికేషన్ జరిపిన తర్వాత అతడికి ఆయుధ లైసెన్స్ జారీ చేసినట్లు ముంబై పోలీసులు ఇవాళ (సోమవారం) తెలిపారు.

పంజాబ్‌ సింగర్ సిద్ధూ మూసేవాలా గతే మీకూ పడుతుందంటూ.. సల్మాన్‌ఖాన్‌, ఆయన తండ్రి సలీంఖాన్‌లకు బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపింది. రోజూ జాగింగ్‌ అయిన తర్వాత సల్మాన్‌ కూర్చునే బెంచిపై ఈ లేఖ  ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. ‘త్వరలో సిద్ధూ మూసేవాలా లాంటి పరిస్థితే మీకూ ఎదురవుతుంది’ అంటూ దుండగులు ఆ లేఖలో బెదిరించారు. దీంతో వెంటనే అలర్టైన పోలీసులు ఆయనకు వ్యక్తిగతంగా, ఇంటి దర్గర భద్రతను పెంచారు పోలీసులు.