బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో 12వేల పేజీలతో చార్జిషీట్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇవాళ చార్జిషీట్‌ దాఖ‌లు చేసింది.  సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు 32 మందిపై కేసులు నమోదు చేసింది. డ్రగ్స్ కేసులకు సంబంధించి 12వేల పేజీల చార్జిషీట్‌ను ప్ర‌త్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులో సమర్పించారు.

గతేడాది ఆగ‌స్టులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద రీతిలో ఆత్మహత్య చేసుకున్నడు. ఈ కేసుతో లింకు ఉన్న సుశాంత్ గ‌ర్ల‌ఫ్రెండ్ రియాను గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం రియాతోపాటు అమె సోదరుడు శౌవిక్‌ బెయిల్ పై బయట ఉన్నారు. ఈ డ్రగ్స్ కేసులో 8 మంది కస్టడీలో ఉన్నారు. దాదాపు 200 మంది సాక్షులను విచారించి.. నిందితులకు సంబంధించి డిజిటల్ సాక్ష్యాలను(వాట్సప్ చాట్స్, వాయిస్ రికార్డింగ్స్, వీడియో చాట్స్…)  చార్జిషీట్ లో పొందుపరిచినట్టు ఎన్సీబీ చీఫ్ స‌మీర్ వాంఖ‌డే చెప్పారు.