ముగ్గురు పిల్లల తల్లివి.. బాడీ ఫిట్నెస్ లేదు.. ఆ హీరో భార్య ఫిజిక్ పై.. శృతిమించిన విమర్శలు..!

Bollywood Hero Wife Teejay Sidhu Strong Counter To Body Shamers In Social Media
Bollywood Hero Wife Teejay Sidhu Strong Counter To Body Shamers In Social Media
Bollywood Hero Wife Teejay Sidhu Strong Counter To Body Shamers In Social Media
Bollywood Hero Wife Teejay Sidhu Strong Counter To Body Shamers In Social Media

స్మార్ట్ ఫోన్ తెచ్చిన రెవల్యూషన్ సమాజానికి ఎంత లాభదాయకమో.. అంతే నష్టాన్ని కలగజేస్తుంది. సామాన్యుడి చేతికి మీడియా రావటం.. భావప్రకటన స్వేచ్ఛలో ప్రజలు భాగస్వామ్యులు అవ్వటం మంచి పరిణామమే. రాజకీయ నాయకులని, సినిమా సెలబ్రెటీలని తమ అభిమానులకి చేరువచేసిన ఘనత సోషల్ మీడియాదే. అయితే ఈ క్రమంలో ట్రోలర్స్ చేసే విష ప్రచారం, నెగిటివిటి సెలబ్రెటీలకు పెద్ద తలనొప్పిగా తయారవుతుంది. అభిమానుల కోసం నిత్యం తమ అప్డేట్స్ పెడుతుంటారు సెలబ్రెటీల పీఆర్వోలు. దీనికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పదించటంతో కావాల్సినంత పబ్లిసిటీ దక్కించుకుంటారు సెలబ్రెటీలు. అయితే అదే సమయంలో కొందరు నెటిజన్స్ చేతిలో విపరీతమైన ట్రోలింగ్ కి కూడా గురవుతుంటారు. ముఖ్యంగా లేడి సెలబ్రెటీలపై ఈ ట్రోలింగ్ దాడి ఎక్కువగా ఉంటుంది. యాంకర్ అనసూయ, రష్మీ వంటి వారు ట్రోలింగ్ కి బెదరకుండా ఎప్పటికప్పుడు వీటిని ఖండిస్తూ ఉంటారు. కొందరు మాత్రం అస్సలు పట్టించుకోరు. ఇలా యాంకర్స్, హీరోలే కాకుండా హీరోల భార్యలకు కూడా అప్పుడప్పుడు ట్రోలింగ్ అవుతుంటుంది.

తాజాగా బాలీవుడ్ హీరోలలో ఒకరైన కరణ్ వీర్ బ్రోహో భార్య టీజీ సిద్దుపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. సిద్దు ఫిజిక్ పై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు. టీజే సిద్దు షేర్ చేసిన బికినీ ఫోటోల కారణంగా ఈ విమర్శలు ఎదురవుతున్నాయి. టీజె సిద్దు స్పెషల్ డిజైన్ చేయించుకున్న స్విమ్ సూట్ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వాటికి పాజిటీవ్ కంటే నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ముగ్గురు పిల్లల తల్లివి, బాడీ అంత ఫిట్ గా లేదు, పొట్ట దెగ్గర కొవ్వు ఎక్కువైంది అంటూ బాడీ షేమింగ్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. అయితే ఈ కామెంట్స్ కి ఎక్కడ బెదరకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది టీజే సిద్ధూ. “నేను ఫొటోలకి ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా పెట్టానని.. పొట్ట భాగాన్ని అంతగా పట్టించుకోనని.. ముగ్గురు పిల్లల తల్లినైనా నాకు నేను అందంగానే కనిపిస్తానని చెప్పింది టీజే సిద్ధూ. తన బాడీపై తనకు మంచి అభిప్రాయముందని.. ఈ అభిప్రాయం ఉన్నంత వరకు తన ఫోటోలని షేర్ చేస్తూనే ఉంటానని.. నేను పోస్ట్ చేసి చాలా కాలం కావటంతో తన శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయని” ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చింది      రణ్ వీర్ బ్రోహో భార్య టీజీ సిద్దు.