ఢిల్లీ ఘాజీపూర్‌ పూల మార్కెట్‌ లో బాంబు కలకలం

Delhi Ghazipur flower market

దేశ రాజధాని ఢిల్లీ ఘాజీపూర్‌ పూల మార్కెట్‌ సమీపంలో బాంబు కలకలం రేపింది. ఇవాళ అనుమానాస్పద స్థితిలో ఓ బ్యాగు కనిపించగా.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

బాంబు స్క్వాడ్‌ సిబ్బంది దాన్ని పరిశీలించగా.. బ్యాగులో ఉన్నది ఐఈడీ పేలుడు పదార్థాలు అని నిర్ధారించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ) సహాయంతో బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.

బాంబు ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా దర్యాప్తుకు ఆదేశించించారు. ఈ కేసును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దర్యాప్తు చేస్తుందని రాకేశ్ తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.