ముంబైలో కలకలం రేపిన బాంబు బెదిరింపు కాల్.. ముమ్మర తనిఖీలు

ఓ అకతాయి చేసిన బాంబు బెదిరింపు కాల్.. ముంబై పోలీసులను పరుగెత్తించింది. నిన్న అర్ధరాత్రి ముంబై  కంట్రోల్‌ రూంకు  ఓ ఫోన్ కాల్ వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతో పాటు జుహులోని అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు పెట్టినట్లు దుండగులు చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

అప్రమత్తమైన ముంబై పోలీసులు.. బాంబు డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ స్క్వా్డ్‌, డాగ్‌ స్క్వాడ్‌, రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ తో కలిసి సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను గుర్తించలేదని ఓ పోలీస్‌ అధికారి చెప్పారు.

బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ ఆకతాయిల పనిగా ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సందర్భంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ముంబై రైల్వే స్టేషన్లు, ప్రముఖుల ఇండ్ల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.