కామన్వెల్త్ గేమ్స్.. సెమీస్ చేరిన బాక్సర్ నిఖత్ జరీన్.. అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇంగ్లాండ్ బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియన్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వేల్స్ దేశానికి చెందిన హెలెన్ జోన్స్ పై విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డిలు నిఖత్ జరీన్ ను అభినందించారు.

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన బృందంతో ప్రేక్షకుల మధ్యన కూర్చొని వీక్షించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై భారత్, ఇండియా.. ఇండియా అని ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ఇండియన్ బాక్సింగ్ బృందం సభ్యులను ప్రోత్సహించారు.