పుణెలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

మహారాష్ట్రలోని పుణెలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్వీఎస్ ఆక్వా టెక్నాలజీస్ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది కార్మికులు మృతిచెందారు.

మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.