ఒక్క కొమ్మకు 839 టమాటలు.. అతడి అదృష్టం మామూలుగా లేదు

tomato
tomato

ఇప్పుడు మార్కెట్లో, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ టమాట. అయితే.. బ్రిటన్ కి చెందిన ఓ వ్యక్తి టమాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తాను పెంచిన టమాట చెట్టుకు అత్యధిక టమాటలు పండించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఒక్క కొమ్మకే 839 టమాటలు పండించి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. బ్రిటన్ కి చెందిన డగ్లస్ స్మిత్.. ఐటీ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఈ మార్చి నెలలో తానే స్వయంగా చెర్రీ టమాట విత్తనం నాటి టమాట చెట్టు పెంచాడు.

తాను పెంచిన టమాట చెట్టు గ్రీన్ హౌజ్ లో ఉండటం వల్ల ఎలాంటి క్రిమీ, కీటకాలు సోకలేదు. వారానికి మూడు, నాలుగు గంటలు మొక్కకే కేటాయించి ఒకే కొమ్మకు 839 టమాటలు పండించాడు. స్థానిక పోలీసులు, చుట్టుపక్కల వాళ్లను పిలిచి వారి ముందే ఆ టమాటలు తెంపి లెక్కపెట్టి చూపించాడు. ఒకే కొమ్మకు పండిన ఆ టమాటలు చూసి పోలీసులతో పాటు స్థానికులు కూడా ముక్కున వేలేసుకున్నారు.


ఇంతకు ముందు 2010లో గ్రాహం టాంటెర్ అనే వ్యక్తి కూడా ఒకే కొమ్మకు 448 టమాటలు పండేలా ప్రయోగం చేశాడు. ఇప్పుడు డగ్లస్… డబుల్ సంఖ్యలో టమాటలు పండించి పాత రికార్డు బ్రేక్ చేశాడు. కానీ.. ఈ రికార్డు డగ్లస్ కి రాలేదు. మామూలు టమాటలకు డగ్లస్ పండించిన టమాటలకు చాలా తేడా ఉంది. డగ్లస్ పండించిన చెర్రీ టమాటాలు సైజులో చిన్నగా ఉంటాయి. రుచిలో పుల్లగా, ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని వంటల్లో కంటే స్నాక్స్ తయారీలో ఎక్కువగా వాడుతారు.