జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తేదీలు ఖరారయ్యాయి. మొత్తం రెండు విడుతలుగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి సెషన్ జరగనుంది. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్ కోసం ఇప్పటికే అన్ని వర్గాల నుంచి కేంద్రం సలహాలు, సూచనలు తీసుకుంది. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగానే బడ్జెట్ ఉంటుందని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఐతే ఈ సారైనా ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబ్ లు పెంచుతారేమోనని వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు.