ఇంగ్లండ్ తో టెస్టు.. టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా

Jaspreet Bumra

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న ఐదో టెస్టు కోసం జస్ప్రిత్‌ బుమ్రాను కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. రిషభ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్‌ శర్మ కరోనా నుంచి కోలుకోకపోవడంతో బుమ్రాను కెప్టెన్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది.

మరోవైపు ఇంగ్లాండ్‌ ఫైనల్‌ 11ను ప్రకటించింది. సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ స్థానంలో ఎంపికైన శామ్ బిల్లింగ్స్‌‌కి కూడా తుది జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్‌ సిరీస్‌లో విఫలమైన ఓపెనర్‌ జాక్ క్రాలీకి మరో అవకాశం లభించింది.

ఇంగ్లాండ్ తుది జట్టు : అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్ (కెప్టెన్), శామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్