హుజూరాబాద్‌లో ప్రారంభమైన ఉపఎన్నిక పోలింగ్‌.. క్యూలో నిల్చున్న ఓటర్లు

Huzurabad By-Election Voting

Huzurabad By-Election Voting

హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఓటర్లు క్యూ లైన్ లలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు నిల్చున్నారు.  రాత్రి 7 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది.

నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, వీణవంక, కమలాపూర్‌, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్‌ జరగుతుంది. 2018లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84.5 శాతం పోలింగ్‌ నమోదయిందని చెప్పారు.

మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,36,283 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నాయి. అయితే ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 1715 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 107 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.