దేశవ్యాప్తంగా 6 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలు

parliament

దేశవ్యాప్తంగా 6 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

బెంగాల్ (1), అస్సాం (1), తమిళనాడు (2), మహారాష్ట్ర (1), మధ్యప్రదేశ్(1) రాష్ట్రాల నుంచి ఖాళీలను భర్తీ చేయనున్నారు.

సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇవ్వనుండగా.. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 22గా నిర్ణయించారు. అక్టోబర్ 4న పోలింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేపట్టనున్నారు.