గుడ్డు, పన్నీర్​ కలిపి తినొచ్చా.?

సండే ఔర్ మండే.. రోజ్ కావో అండే అన్నది ఎన్ఈసీసీ. పన్నీర్ తింటే పోషకాలు మీ ఇంటే అంటారు ఆహా నిపుణులు. ఈ రెండింటిలోనూ ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. రెండూ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుట్టెడు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి ఒకేసారి తింటే ఆరోగ్యానికి మంచిది కాదా? బరువు తగ్గాలనుకునేవారు ఈ కాంబినేషన్ ని డైట్ లో చేర్చుకోవచ్చా? బరువు తగ్గాలనుకునేవారికి డైటిషియన్లు చెప్తున్న సలహాలివే..


బరువు తగ్గాలంటే ప్రొటీన్లు ఎక్కువగా.. కేలరీలు తక్కువగా ఉన్న ఫుడ్ తినాలి. అందుకే.. బరువు తగ్గాలనుకునే వారు గుడ్లు, పన్నీర్ ఎక్కువగా తీసుకుంటారు. ఈ రెండింటిలోనూ ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. తినగానే కడుపు నిండుతుంది. గుడ్డు, పన్నీర్ తినడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్లు రిలీజవుతాయి. చాలాసేపటి వరకు ఆకలి కాదు. దీంతో చాలాసేపటి వరకు ఆకలి కాదు. 

కొందరు పన్నీర్, గుడ్లు కలిపి తింటుంటారు. బరువు తగ్గాలనుకునేవారికి ఈ కాంబినేషన్ ప్లస్సా? మైనస్సా? గుడ్డు, పన్నీర్ కలిపి తింటే మంచిదే అంటున్నారు న్యూట్రిషియన్లు. ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గడానికి ఈ రెండు కలిపి తింటే వచ్చే నష్టమేమి లేదని సూచిస్తున్నారు.

  • ఒక కోడిగుడ్డులో 4.8 గ్రాములు ఫ్యాట్​, విటమిన్​–ఎ, కాల్షియం, విటమిన్​ – డి, రిబోఫ్లెవిన్​, విటమిన్– బి12, ఫొలేట్, ​విటమిన్​– ఈ, నియాసిన్, ఐరన్ పోషకాలుంటాయి. రెగ్యులర్ గా వీటిని తినడం వల్ల తేలిగ్గా బరువు తగ్గొచ్చు.
  • గుడ్లలోని సాలిటి ఇండెక్స్ అంటే.. కడుపు నిండినట్టు అనిపించే లక్షణాల వల్ల తొందరగా ఆకలి కాదు.
  • గుడ్లు తినడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.
  • కోడిగుడ్డులో శరీరానికి కావాల్సిన అమినో యాసిడ్స్​ లభిస్తాయి. ఇవి శరీర బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి.

  • 100 గ్రాముల పన్నీర్​లో 1.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు​, 72 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లకి దీన్ని మించిన బెస్ట్​ ఆప్షన్​ మరొకటి లేదు.
  • పన్నీర్​ ద్వారా లభించే కొవ్వు కణాలు​ బరువు తగ్గడంలో కీ-రోల్​ పోషిస్తాయి. గుడ్​ ఫ్యాట్​ ఎక్కువగా ఉంటే శరీరం ఎనర్జీ కోసం దాన్ని ఖర్చుచేస్తుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు.
  • పన్నీర్​లో కాంజుగేటెడ్​ లినోలిక్​ యాసిడ్​ ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్​ లాస్​కి, బాడీ బిల్డింగ్​కి బెస్ట్​ సప్లిమెంట్​​.

  • వంద గ్రాముల పన్నీర్​లో 83 గ్రాముల కాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తుంది, బాడీలో పేరుకున్న ఫ్యాట్​ని కరిగించడానికి సాయం చేస్తుంది.
  • పన్నీర్ లో లభించే కాల్షియం.. బాడీ కోర్​ టెంపరేచర్​ థర్మోజెనెసిస్​ పెంచుతుంది. దానివల్ల మెటబాలిజం బూస్ట్ అయ్యి బరువు తగ్గొచ్చు.

లాభమే ఎక్కువ
పన్నీర్​, కోడి గుడ్లని కలిపి తింటే ఎలాంటి నష్టం లేదంటున్నారు న్యూట్రిషియన్లు. వీటిలో ప్రొటీన్​, కాల్షియం, విటమిన్​– బి12, ఐరన్​ పుష్కలంగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది. డైజెషన్​ ట్రాక్​ని స్లో చేసి.. తొందరగా ఆకలి కాకుండా ఆపి.. బరువు తగ్గడానికి సాయపడతాయి.

డైట్​లో ఉన్నవాళ్లు పన్నీర్​ టిక్కా, స్క్రాంబుల్డ్​ పన్నీర్, పన్నీర్ 65 లాంటివి మాత్రమే తినాలి. పన్నీర్​ బటర్​ మసాలా లాంటి వాటిని పూర్తిగా దూరం పెట్టాలి. కోడిగుడ్లని కూడా వీలైనంతవరకు ఉడకబెట్టుకుని మాత్రమే తినాలి.